Prabhas : స‌లార్‌తో చ‌రిత్ర సృష్టించిన ప్ర‌భాస్.. భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రికి సాధ్యం కాని రికార్డ్ ఇది..!

Prabhas : తెలుగు చిత్ర పరిశ్రమకు తన స్టామినాను ఎప్పుడో చూపించి.. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత నుంచి పాన్ ఇండియాపైనా పాగా వేసి అద్భుతాలు సృష్టిస్తున్నాడు ప్ర‌భాస్. ఇటీవ‌లి కాలంలో స‌రైన స‌క్సెస్ లు లేక ఇబ్బంది పడుతున్న ప్ర‌భాస్ తాజాగా స‌లార్ తో ప‌ల‌క‌రించాడు. ఎన్నో అంచనాలను ఏర్పరచుకున్న ఈ మూవీ శుక్రవారమే విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రమే ‘సలార్: సీజ్‌ఫైర్’. ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు నటించారు. రవి బస్రూర్ మ్యూజిక్ ఇచ్చాడు.

స‌లార్ చిత్రం ప్ర‌స్తుతం వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది.2 రోజుల్లో ‘సలార్: సీజ్‌ఫైర్’ తెలుగులో భారీ వసూళ్లు సాధించింది. ఫలితంగా నైజాంలో రూ. 33.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.45 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.04 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.90 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.87 కోట్లు, గుంటూరులో రూ. 5.60 కోట్లు, కృష్ణాలో రూ. 3.53 కోట్లు, నెల్లూరులో రూ. 2.53 కోట్లతో.. రూ. 71.52 కోట్లు షేర్, రూ. 104.65 కోట్లు గ్రాస్ వసూలు అయింది. ప్ర‌పంచ వ్యాప్తంగా స‌త్తా చాటుతున్న స‌లార్ చిత్రం 2 రోజుల్లో తెలుగులో రూ. 71.52 కోట్లు, తమిళంలో రూ. 4.45 కోట్లు, కర్నాటకలో రూ. 9.65 కోట్లు, కేరళలో రూ. 3.20 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 19.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 35.20 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 143.27 కోట్లు షేర్, రూ. 251.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

Prabhas created history with salaar movie
Prabhas

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్: సీజ్‌ఫైర్’ మూవీకి రెండు రోజుల్లోనే రూ. 251 కోట్లు గ్రాస్ వసూలు అయింది. ఫలితంగా ఏకంగా 5 సార్లు ఈ మార్కును దాటిన తెలుగు హీరోగా అతడు రికార్డు సాధించాడు. అదే సమయంలో రెండో రోజు ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ సాధించిన సినిమాగానూ సలార్ రికార్డును నమోదు చేసుకుంది. ఇక తొలి రోజు ఈ సినిమాకి భారీగానే వ‌సూళ్లు వ‌చ్చాయి. ప‌ఠాన్, యానిమ‌ల్ చిత్రాల రికార్డుల‌ని సైతం బ్రేక్ చేసి ప్ర‌భాస్ స్టామినా ఏంటో తెలియ‌జేసింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago