Prabhas : తెలుగు చిత్ర పరిశ్రమకు తన స్టామినాను ఎప్పుడో చూపించి.. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత నుంచి పాన్ ఇండియాపైనా పాగా వేసి అద్భుతాలు సృష్టిస్తున్నాడు ప్రభాస్. ఇటీవలి కాలంలో సరైన సక్సెస్ లు లేక ఇబ్బంది పడుతున్న ప్రభాస్ తాజాగా సలార్ తో పలకరించాడు. ఎన్నో అంచనాలను ఏర్పరచుకున్న ఈ మూవీ శుక్రవారమే విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రమే ‘సలార్: సీజ్‌ఫైర్’. ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు నటించారు. రవి బస్రూర్ మ్యూజిక్ ఇచ్చాడు.
సలార్ చిత్రం ప్రస్తుతం వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది.2 రోజుల్లో ‘సలార్: సీజ్‌ఫైర్’ తెలుగులో భారీ వసూళ్లు సాధించింది. ఫలితంగా నైజాంలో రూ. 33.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.45 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.04 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.90 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.87 కోట్లు, గుంటూరులో రూ. 5.60 కోట్లు, కృష్ణాలో రూ. 3.53 కోట్లు, నెల్లూరులో రూ. 2.53 కోట్లతో.. రూ. 71.52 కోట్లు షేర్, రూ. 104.65 కోట్లు గ్రాస్ వసూలు అయింది. ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతున్న సలార్ చిత్రం 2 రోజుల్లో తెలుగులో రూ. 71.52 కోట్లు, తమిళంలో రూ. 4.45 కోట్లు, కర్నాటకలో రూ. 9.65 కోట్లు, కేరళలో రూ. 3.20 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 19.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 35.20 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 143.27 కోట్లు షేర్, రూ. 251.15 కోట్లు గ్రాస్ వచ్చింది.
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్: సీజ్‌ఫైర్’ మూవీకి రెండు రోజుల్లోనే రూ. 251 కోట్లు గ్రాస్ వసూలు అయింది. ఫలితంగా ఏకంగా 5 సార్లు ఈ మార్కును దాటిన తెలుగు హీరోగా అతడు రికార్డు సాధించాడు. అదే సమయంలో రెండో రోజు ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ సాధించిన సినిమాగానూ సలార్ రికార్డును నమోదు చేసుకుంది. ఇక తొలి రోజు ఈ సినిమాకి భారీగానే వసూళ్లు వచ్చాయి. పఠాన్, యానిమల్ చిత్రాల రికార్డులని సైతం బ్రేక్ చేసి ప్రభాస్ స్టామినా ఏంటో తెలియజేసింది.