Prabhas Caravan : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ఇప్పుడు హై బడ్జెట్ చిత్రాలు చేస్తున్నారు. ఆయన రెమ్యునరేషన్ ప్రతి సినిమాకి రూ.150 కోట్లపైగానే ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రభాస్ చాలా రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆయన వాడే ప్రతి వస్తువు కూడా అందరిని మంచిపోయేలా ఉంటుందని సమాచారం. అయితే ప్రభాస్ వాడే కారవ్యాన్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుందట. ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీనే ఆ కారవ్యాన్ చూసి అవాక్కయ్యారట. సాధారణంగా షూటింగ్‌ల సమయంలో నిర్మాతలే హీరోలకు కాస్ట్ లీ కార్ వ్యాన్లను ఏర్పాటు చేసేవారు. ఆ తర్వాత హీరోలే సొంతంగా కార్ వ్యాన్ లను కొనుగోలు చేసుకుంటున్నారు.
ఆయా హీరోల ఇల్లులు ఎంత విలాసవంతంగా ఉంటాయో.. వాళ్ళ వ్యానిటీ వ్యాన్లను కూడా అంతే విలాసవంతగా ఉండేలా స్పెషల్ గా డిజైన్ చేయించుకుంటూ ఉంటారు.వీరు షూటింగ్ సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి షూటింగ్ కోసం రెడీ అవడానికి ఇలాంటి ఎన్నో పనుల కోసం ప్రత్యేకంగా కార్ వ్యాన్ ను హీరోలు, హీరోయిన్లు ఉపయోగించుకుంటూ ఉంటారు. అప్పుడేప్పుడో అల్లు అర్జున్ కోన్న కార్ వ్యాన్ ఎమత్ హాట్ టాపిక్ గా మారిందో మనం చూసాం. ఇక ఇప్పుడు ప్రభాస్ వ్యానిటీ వ్యాన్ గురించి జోరుగా చర్చ నడుస్తుంది. ఇందులో అన్ని లగ్జరీ సౌకర్యాలు ఉండేలా దీనిని డిజైన్ చేయించుకొని మరీ కొనుగోలు చేశాడట ప్రభాస్.
అందరి కార్ వ్యాన్ ల కాకుండా ప్రభాస్ కు ఉన్న కార్ వ్యాన్ కు మాత్రం చాలా ప్రత్యేకత ఉందట. అది ఏమిటంటే..?? ఇంత లగ్జరీగా డిజైన్ చేయించుకున్న కార్ వ్యాన్ లో సహజసిద్దమైన వెలుతురు వచ్చే ఒక సన్ రూఫ్ పీచర్ ఉండడం గమనార్హం. ఈ విషయాన్ని అతనితో ‘ఆదిపురుష్’ మూవీని తెరకెక్కించిన దర్శకుడు ఓం రౌత్ తన సోషల్ మీడియాలో తెలియజేసాడు. ఔట్ డోర్ లొకేషన్ లో షూటింగ్ చేసేటప్పుడు ఆర్టిఫీషియల్ వెలుతురు కాకుండా సహజ సిద్దమైన వెలుతురును ఆస్వాదించేందుకు ఈ కార్ వ్యాన్ ను కస్టమైజ్ చేయించుకున్నారట. ఇందులో ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ ఉంటాయట. ముకేష్ అంబానీని కూడా ఈ కార్ వ్యాన్ ఆశ్చర్యపరచిందంటే ఇందులో ఇంకెన్ని ఫీచర్స్ ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…