Pothina Mahesh : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీల్లో సీట్ల కేటాయింపు కొత్త సమీకరణాలకు కారణమవుతున్నది. సీట్లు దక్కని అసంతృప్త నేతలు పార్టీ వీడతున్నారు. రీసెంట్‌గా జనసేన నేత పోతిన మహేష్ మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరి, రమేశ్ రెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడినా గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. జనసేనకు గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. ఉదయాన్నే భారీ ర్యాలీగా ఆయన విజయవాడ నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా గంటావారిపాలెం చేరుకున్నారు. జగన్ బస్సుయాత్ర స్టే పాయింట్ దగ్గర అనుచరులతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు.
విజయవాడ వెస్ట్ టిక్కెట్ కన్ఫామ్ అయ్యాక, సుజనా చౌదరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇదెందుకో, పోతిన మహేష్‌కి నచ్చలేదు. అప్పటినుంచీ ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. జనసేనలో అంతర్యుద్ధానికి తెరలేపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలిపించుకుని మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోయింది. పోతిన మహేష్ జనసేన పార్టీని వీడి, వైసీపీలో చేరిపోయారు. ఇక్కడే విజయవాడ వెస్ట్ ఈక్వేషన్ అనూహ్యంగా మారింది. ఒక్కసారిగా జనసైనికులు సుజనా చౌదరి పట్ల సానుకూలతను ప్రదర్శించడం మొదలు పెట్టారు. ఇదంతా, పోతిన మహేష్ మీద ఏర్పడ్డ అసహనం తాలూకు ఫలితమే.
పోతిన మహేష్ గనుక జనసేన పార్టీని వీడకుండా వుండి వుంటే, విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీకి పడాల్సిన జనసేన ఓట్లలో ఎంతో కొంత కోత పడి వుండేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు పోతిన మాట్లాడుతూ.. సుజనా చౌదరి.. పవన్ తల్లిని తిట్టాడు. అలాంటి వాడిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటారా.. మీలా నేను రెండు జెండాలు మోయలేను. నేను ఏది చేసిన నిజాయతీగా చేస్తాను. మీలా డబుల్ గేమ్‌లు ఆడాను. జనసేన పార్టీ కోసం నేను ఎంతో కష్టపడ్డాను. మీరు నా గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు బాగుండదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశరు మహేష్.