Posani Krishna Murali : తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు,దర్శకుడు రచయిత పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇటీవల కాలంలో ఈయన తరచూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. సినిమాలకు సంబంధించి రాజకీయాలకు సంబంధించిన విషయాలలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు.అంతేకాకుండా ఏ విషయాన్ని అయినా కూడా వ్యంగ్యంగా స్పందిస్తూ ఉంటారు.కాగా చాలా కాలం నుంచి పోసాని వైసీపీ, వైఎస్ జగన్ మద్దతు దారుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.రాజకీయ పరమైన అంశాలపై సైతం పోసాని ప్రత్యర్థులపై విరుచుకుపడడం చూస్తూనే ఉన్నాము. పోసానిని ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా జగన్ నియమించడంఓ ఆయన వైసీపీ పార్టీలో జగన్ కి వీర విధేయుడిగా మారారు.
ప్రత్యర్థులపై విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు పోసాని.తాజాగా పోసాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మొన్నటి వరకు చంద్రబాబు, లోకేష్, పోసానిపై దుమ్మెత్తి పోసిన పోసాని తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీవీ 5 సాంబశివరావుని ఉద్దేశించి సాంబ అంటూ ఆయనపై మండిపడ్డారు. చంద్రబాబుకి అంత మంది సెక్యూరిటీ పెట్టుకున్నారు. లోకేష్ డ్రాయర్స్‌తో పరుగెత్తిస్తానంటున్నాడు. ఒరే సాంబ మీ దాంట్లోనే వారి గురించి ఒకప్పుడు విలవిల అని రాసారు కదరా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
![Posani Krishna Murali : ఒరే సాంబ అంటూ టీవీ5 సాంబశివరావుపై నిప్పులు చెరిగిన పోసాని Posani Krishna Murali strong comments on tv5 sambashiva rao](http://3.0.182.119/wp-content/uploads/2023/08/posani-krishna-murali-2.jpg)
నేను చంద్రబాబు లోకేష్‌లని విమర్శించానట. అందుకు నన్ను రోడ్డుపైకి లాగుతానని వాళ్ల ఆఫీస్ స్టాఫ్ ముందు ఛాలెంజ్ చేసి.. నాకు ఫోన్ చేశాడు. ఏమండీ మీరు ఇలా ఆరోపణలు చేశారు కదా.. మా డిబేట్‌కి రండి.. మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించండి. లోకేష్ బాబు ఎలాంటి వాడో మీ ద్వారా తెలుసుకోవాలని ఉందని సాంబ అన్నాడు. ‘ఏమయ్యా మీ సాంబశివరావు నా బట్టలు ఊడదీయడానికి పిలిచాడు. అతనికి మరోసారి చెప్పండి.. నా బట్టల్ని ఊడదీయడం కాదు.. వాడి బట్టల్నే ఊడగొట్టి వెళ్తా అని చెప్పాను. దాంతో వాళ్లు.. ‘మేం కూడా చెప్పాం సార్.. కానీ వాడు వినడం లేదు’ అని అన్నారు పోసాని. ఇప్పుడు పోసాని చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.