Posani Krishna Murali : ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ప్రచార సమయం దగ్గర పడుతుండడంతో ఆయా పార్టీలు ప్రచారం స్పీడ్ పెంచాయి.ఇక పవన్ కళ్యాణ్ ఈ సారి గెలవాలనే కసితో ఉన్నారు.ఆయన కోసం మెగా హీరోలతో పాటు శ్రేయోభిలాషులు కూడా వచ్చి ప్రచారాలు చేస్తున్నారు. రీసెంట్ చిరంజీవి కూడా ప్రత్యేక వీడియో విడుదల చేసి పవన్‌కి తన మద్దతు తెలియజేశారు. చిరు సపోర్ట్ చేసిన తర్వాత ఆయనపై విమర్శల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో వైసీపీ నేత, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి చిరంజీవిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బుధవారం మీడియాతో మాట్లాడిన పోసాని కృష్ణమురళి.. చిరంజీవి తీరుపై మండిపడ్డారు. రాజకీయాలు నాకు సరిపోవంటూ వదిలేసి వెళ్లిపోయిన చిరంజీవి.. మళ్లీ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. జనసేనకు ఓటు వేయమని ఎలా కోరుతారంటూ నిలదీశారు. పవన్ కళ్యాణ్‌కు గెలిపించమని చిరంజీవి ఎలా చెబుతారు. ప్రజలంటే ఆయనకు చాలా చీప్ అభిప్రాయం.. వాళ్లేం చేస్తారులే అనుకుంటారు. ఆయన ఓ వెరీగుడ్ బిజినెస్ మ్యాన్. సినిమాల్లో టాప్ హీరో. చిరంజీవి ప్రజారాజ్యం పెడితే 18 సీట్లు వచ్చాయి. ఏ రోజైనా రాష్ట్ర సమస్యల మీద ప్రశ్నించారా? ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో అయినా కూర్చున్నారా. ముఖ్యమంత్రి అయితే ఎంజాయ్ చేద్దాం. ఓట్లు వేయకపోతే వెళ్లిపోదాం అనుకున్నారు. ఆయన దృష్టిలో అది బిజినెస్.

18 మంది ఎమ్మెల్యేలను మీ దారి మీరు చూసుకోమన్నారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. కేంద్ర మంత్రి అయ్యారు. మరి అక్కడైనా ఉన్నారా?” అని నిలదీశారు. “రాజకీయం నాకు సెట్ కాదు. వద్దని వెళ్లిపోయారు. తప్పుతెలుసుకుని వెళ్లిపోయిన చిరంజీవి.. మళ్లీ ఇప్పుడెందుకు రాజకీయాలు మాట్లాడుతున్నారు. చిరంజీవి జీవితంలో మళ్లీ ప్రజల దగ్గరకు వెళ్లొచ్చా? అని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. చిరంజీవి వెన్నుపోటు పొడిచినందుకు కాపు యువత బలయ్యారన్న పోసాని.. మళ్లీ ఇప్పుడు జనసేన తరుపున ప్రచారం చేయడానికి వచ్చారంటూ ఎద్దేవా చేశారు. రూపాయి లంచం లేకుండా పేదల ఖాతాల్లోకి నగదు జమ జరుగుతోందని, జగన్ పరిపాలనలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పుకొచ్చారు పోసాని.