Posani Krishna Murali : వారాహి విజయాత్ర సభలో పవన్ కళ్యాణ్.. వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వారు కూడా తిరిగి అటాక్ చేస్తున్నారు. కొద్ది సేపటి క్రితం పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వాలంటీర్ల పై పవన్ చేస్తున్న వ్యాఖ్యలను తప్పు పట్టిన పోసాని ..ఆ మాటలు చంద్రబాబు నుంచి వస్తున్న మాటలుగా పేర్కొన్నారు. వాళ్ళ ట్రాప్ లో పడి అందరికి దూరం అయ్యావు అని అన్నారు పోసాని. చంద్రబాబు చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ ఆడుతున్నారని.. టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా వల్ల తన కుటుంబానికి గతంలో జరిగిన అవమానాలను పవన్ ఎలా మరిచిపోయారని ప్రశ్నించారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒకసారి ప్రత్యేక హోదా అవసరంలేదని, మరోసారి కావాలని డిమాండ్ చేశారని.. అప్పుడు సినిమా ఇండస్ట్రీ ఏవైపు ఉండాలో అర్థంకాని పరిస్థితిలో ఉండిపోయిందని పోసాని గుర్తుచేశారు. శ్రీ కృష్ణుడు గోపికలతో సరసాలు ఆడినట్లు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ సరసాలు ఆడాడు. అప్పుడు పవన్ అడగలేదని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం నాశనం కావాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారుని..జగన్ ఏం పాపం చేసారని పోసాని ప్రశ్నించారు. చంద్రబాబు పొరపాటున కూడా పవన్ ను సీఎం చేయరని పోసాని అన్నారు.
![Posani Krishna Murali : పవన్ గెలిచే వాడే.. రూ.15 కోట్లతో టీడీపీనే ఓడించిందన్న పోసాని.. Posani Krishna Murali comments on pawan kalyan](http://3.0.182.119/wp-content/uploads/2023/07/posani-krishna-murali.jpg)
అసలు భీమవరంలో రూ 15 కోట్లు ఖర్చు చేసి టీడీపీ నేతలే పవన్ ను ఓడించారని పోసాని కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు, ఆయన కొడుకు పుణ్యమా అని డేటా చోరీ జరిగిందన్నారు. పవన్ ను చంద్రబాబు ఎమ్మెల్యేగా కూడా గెలవనీయరని పోసాని జోస్యం చెప్పారు. ఏదైనా సమాచారం ఉంటే నిఘా సంస్థలు ప్రభుత్వ పెద్దలకు చెబుతారని , పవన్ కళ్యాణ్ ఎవరని ఆయనకు చెబుతారని పోసాని ప్రశ్నించాడు. పవన్ కు విలువలు ఉంటే వెంటనే వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు జగన్ సీఎంగా ఉంటారని పోసాని చెప్పుకొచ్చారు. పవన్‌కి ప్రజల ఆశీర్వాదం లేదు కాబట్టి వార్డ్ మెంబర్ కూడా కాలేడని అన్నారు.