Posani Krishna Murali : మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ వైసీపీకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్… వారాహి యాత్రలో భాగంగా విమర్శలు గుప్పిస్తుంటే, ఇటీవల చిరంజీవి కూడా ఏపీ ప్రభుత్వానికి సైలెంట్‌గా వార్నింగ్ ఇచ్చినట్టు అర్ధమవుతుంది. చిరంజీవి కామెంట్స్ తర్వాత ఆయనపై రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు, పేర్ని నాని, ఇలా పలువురు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమా టికెట్ల ధరలను 25 రూపాయలను పెంచుకునేలా అనుమతులు ఇవ్వాలంటూ సినిమా యూనిట్ ప్రభుత్వాన్ని కోరింది.
కానీ ప్రభుత్వం మాత్రం ధరల పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన కామెంట్స్ కారణంగా భోళాశంకర్ రిక్వెస్ట్‌ను జగన్ ప్రభుత్వం తిరస్కరించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన పోసాని హీరోలు ఒక్కో సినిమా యాభై నుంచి అరవై కోట్లలో రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారని, హీరోలు రెమ్యునరేషన్స్ తగ్గించుకొని సినిమాలు చేస్తే నిర్మాతలకు భారం తగ్గుతుందని పోసాని కృష్ణమురళి అన్నారు. హీరోలందరూ బాగా సెటిల్ అయ్యారని పోసాని చెప్పాడు. సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టులు, చిన్న నిర్మాతలు నష్టపోయారు తప్పితే హీరోలు ఎవరూ నాశనమైన దాఖలాలు లేవని చెప్పాడు. సినిమా టికెట్ల ధరలు పెంచితే ఆ డబ్బులు దర్శకనిర్మాతలు, హీరోల జేబుల్లోకి వెళతాయని, ఆ డబ్బులతో హీరోలు బిల్డింగ్‌లు కొనుక్కొంటారని పోసాని అన్నారు.
![Posani Krishna Murali : చెప్పు తెగుతుంది అంటూ పోసాని కృష్ణ మురళి ఫైర్..! Posani Krishna Murali angry on pawan kalyan and chiranjeevi](http://3.0.182.119/wp-content/uploads/2023/08/posani-krishna-murali.jpg)
టికెట్ల రేట్ల పెంపు వల్ల ఇండస్ట్రీ మొత్తానికి కాకుండా కొందరికే ప్రయోజనం చేకూరుతుందని గతంలోనే ముఖ్యమంత్రితో సినీ పెద్దలు ఏర్పాటు చేసిన మీటింగ్‌లో తాను జగన్‌తో చెప్పానని పోసాని కృష్ణ మురళి చెప్పాడు. ఇదే నిజమైతే నేను నా చెప్పుతో కొట్టుకుంటాను. అందరి ముందే నేను ఈ విషయాన్ని జగన్‌తో చెప్పాను. నేను చెప్పింది అబద్ధమైతే నిజం వాళ్లనే చెప్పమనండి అంటూ సినిమా టికెట్ల ధరలపై పోసాని కృష్ణ మురళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.