Poonam Pandey : బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే మరణం ఎంతో మంది అభిమానులను విషాదంలోకి నెట్టిన విషయం తెలిసిందే. సర్వికల్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆమె శుక్రవారం తుదిశ్వాస విడిచారనే విషయం సినీ ప్రముఖులను, సన్నిహితులు, శ్రేయోభిలాషులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆమె మరణానికి లక్షలాది మంది సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలిపారు. ఆమె మరణవార్తపై నివాళులు తెలుపుతూ కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారు. సోషల్ మీడియాలో రిప్ పూనమ్ పాండే పేరుతో ట్రెండింగ్ కూడా అయింది. మరోవైపు ఎంతో ఫిట్‌గా చలాకీగా ఉండే పూనమ్ పాండే ఆకస్మికంగా చనిపోవడం ఏంటీ అంటూ పలువురు నెటిజన్స్ క్వశ్చన్ చేస్తూ ఆరా తీశారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అయిండొచ్చు అని కామెంట్స్ సైతం చేశారు.
పూనమ్ పాండే మృతి తర్వాత ఆమె బాడీ కన్పించలేదని, ఆమె కుటుంబసభ్యులు కన్పించడం లేదనే వార్తలు వెల్లువెత్తాయి. మరోవైపు అసలు గర్భాశయ కేన్సర్ అంటే ఏమిటి, ఎందుకొస్తుంది, చిన్న వయస్సువారికి కూడా ఈ సమస్య వస్తుందా అనేది పెద్దఎత్తున చర్చనీయాంశమైంది. సరిగ్గా 24 గంటల తరువాత తాను బతికున్నానంటూ పోస్ట్ విడుదల చేసింది పూనం పాండే. అంతే ఒక్కసారిగా ఉత్కంఠ వీడిపోవడమే కాకుండా నెటిజన్లు పెద్దఎత్తున ఆమెపై మండిపడటం ప్రారంభించారు. తాజాగా తాను బతికే ఉన్నట్లు వీడియో విడుదల చేసింది పూనమ్ పాండే. అందులో అలా తాను ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా తెలిపింది. “నేను మీ అందరితో ఒకటి చెప్పేందుకు ఇలా వీడియో చేస్తున్నాను. నేను బతికే ఉన్నాను. నేను సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించలేదు. కానీ, ఎన్నో వేల మంది అమ్మాయిలు ఈ క్యాన్సర్‌తో చనిపోయారు. సర్వైకల్ క్యాన్సర్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక అంతమంది అమ్మాయిలు చనిపోవడం చాలా బాధాకరం” అని పూనమ్ పాండే తెలిపింది.
ఇతర క్యాన్సర్స్‌లాగే సర్వైకల్ క్యాన్సర్‌కు కూడా నివారణ ఉంది. త్వరగా గుర్తిస్తే హెచ్‌పీవీ వ్యాక్సిన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించవచ్చు. ఈ క్యాన్సర్ ద్వారా ఏ ఒక్కరి ప్రాణం కూడా పోకుండ ఉండేందుకు మనం కృషి చేయాలి. ఈ క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరికి చేరేలా మనం తీవ్రంగా అవగాహన పెంపొందించాలి. ప్రతి ఒక్క అమ్మాయికి ఇది చేరి దీనిపై ముందడుగు వేసేలా అవగాహన కల్పించాలి. బయోలో ఉన్న లింక్ లోకి వెళ్లి దీని గురించి మరింత లోతుగా తెలుసుకోండి” అని పూనమ్ పాండే తన వీడియోతోపాటు లింక్ షేర్ చేసింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…