Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Poltergeist On OTT : ఈ హార‌ర్ మూవీ చాలా డేంజ‌ర్.. సినిమా తీస్తూనే ఆరుగురు మృతి.. ఎక్క‌డ చూడాలంటే..?

Shreyan Ch by Shreyan Ch
July 21, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Poltergeist On OTT : ఇటీవ‌ల హార‌ర్ మూవీస్ కి క్రేజ్ ఎక్కువ‌గా ఉంది. హార‌ర్ సినిమాలు చూసేందుకు ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపుతున్నారు. భయపెట్టే హర్రర్ సినిమాలలో భయపెట్టే ఎలిమెంట్స్ ఉంటూ ఉంటాయి. కొన్ని కల్పిత కథలైతే.. మరికొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి ఆధారంగా తీసుకుని రూపొందించిన కథలు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా అయితే.. ఏకంగా మూవీ తీసేటప్పుడే కొంతమంది నటి నటులు.. భయపడి చనిపోయారట. మ‌రి ఆ సినిమా ఎంత‌గా భ‌య‌పెట్టిందో అర్ధం చేసుకోవ‌చ్చు. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. సాధారణంగా హారర్ సినిమాల్లో దెయ్యాలు మనుషుల్ని వెంటాడి చంపడం చూస్తుంటాం. లేదంటి అలాంటి హారర్ సినిమాలు చూస్తునప్పుడు భయపడి చనిపోయిన ప్రేక్షకులను చూసుంటాం. కానీ ఓ హారర్ మూవీని తీసిన ఆరుగురు నటీనటులు ప్రొడక్షన్ సమయంలోనో లేదా సినిమా రిలీజ్​ అయిన కొద్ది రోజుల్లోనే చనిపోవడం ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది.

మరి ఆ సినిమా ఏదో కాదు 1982 లో హాలీవుడ్ లో వచ్చిన.. “పోల్టర్‌గైస్ట్” మూవీ. ఈ సినిమాను టోబీ హూపర్ డైరెక్ట్ చేయగా.. ప్రముఖ దర్శకుడు స్టీఫెన్ స్పీల్‌బెర్గ్ స్క్రీన్ ప్లే అందించారు. అయితే ఈ హర్రర్ మూవీ తీసిన సమయంలోనే సెట్ లో అందరికి వణుకు పుట్టించాయట కొన్ని సీన్స్. ఒక కుటుంబం నివసిస్తున్న.. ఇంటి పైన వరుసగా దెయ్యాలు దాడి చేసి.. అదే ఇంట్లో ఉండే వాళ్ళ కూతురిని ఎత్తుకుని వెళ్లిపోతాయి. ఆ తర్వాత ఏం జరిగింది ? ఎందుకు ఆ దెయ్యాలు ఆ ఇంటిపై దాడి చేస్తాయి? అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. అయితే ఈ మూవీ క్లైమాక్స్ సీన్ లో ఒక లేడి అస్థిపంజరాలు ఉన్న ఓ చెరువులోకి దూకుతుంది. షూటింగ్ సమయంలో.. ఆ చెరువులో డమ్మీ ఆస్థి పంజరాలు పెట్టకుండా నిజమైన అస్థి పంజరాలను పెట్టారట మేకర్స్ .

Poltergeist On OTT know where is it streaming details here
Poltergeist On OTT

ఆ కొలనులోకి దూకినప్పుడు జోబెత్​కు అవి నిజమైన అస్థిపంజరాలని తెలీదట. చాలా కాలం తర్వాత తనకీ విషయం తెలిసిందని జోబెత్​ చెప్పింది. అయితే నిజమైన అస్థిపంజరాలను ఉపయోగించడం, చనిపోయినవారిని అవమానించడమేనని, అందుకే అస్థిపంజరాల శాపం తగిలినట్లు పుకార్లు వచ్చాయి .. మూవీలో పెద్ద కూతురిగా నటించిన డొమినిక్ డూన్​ 1982 నవంబర్ లో తన బాయ్​ఫ్రెండ్​ చేతిలో హత్యకు గురైంది. అప్పుడు ఆమె వయసు 23. చిన్న కూతురుగా నటించిన హీథర్ ఓరూర్కీ 12 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో కన్నుమూసింది. సినిమాలోని మారో కాస్ట్ మెంబర్ లూ పెర్రీమాన్ 2009లో దారుణ హత్యకు గురయ్యాడు. ఇక ఈ సినిమాలో మాంత్రికుడిగా చేసిన జూలియన్ బెక్ 1987లో క్యాన్సర్ తో చనిపోయాడు. అనంతరం మూడు చావులు ఈ సినిమా ఫ్రాంచైజీతోనే ముడిపడ్డాయని వార్తలు వచ్చాయి. వీరిలో ప్రీస్ట్​ పాత్ర పోషించిన జులియన్ బెక్​ 1987లో క్యాన్సర్​తో మరణించాడు. ఇక పోల్టర్‌గిస్ట్ రెండో భాగంలో నటించిన షామాన్​(ఆత్మలతో మాట్లాడేవాడు) విల్ సాంప్సన్ కూడా కిడ్నీ ఫెయిల్​తో చనిపోయాడు. ఇతడు మూవీ సెట్స్​లో దెయ్యం ఉందంటూ, అతడు ఆ దెయ్యాన్ని తరిమేయడానికి ప్రత్యేకంగా పూజలు కూడా చేయించాడు. అయినా కూడా మరణించాడు. ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌తో పాటు డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

Tags: Poltergeist On OTT
Previous Post

Bharateeyudu 2 Collections : మ‌రింత దారుణంగా ఇండియ‌న్ 2 క‌లెక్షన్స్.. శంక‌ర్ పెద్ద దెబ్బే వేశాడుగా..!

Next Post

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ సింగ‌పూర్ వెళ్ల‌డానికి కార‌ణం ఇదే.. అస‌లు కార‌ణం తెలిసింది..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Raghurama Krishnam Raju : నాలుగేళ్ల త‌ర్వాత ఏపీలో అడుగుపెట్టిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్‌కి థ్యాంక్స్

by Shreyan Ch
January 16, 2024

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

29 రోజుల్లో పూర్తైన చిరంజీవి సినిమా.. ఏకంగా 500 రోజులు ఆడింది.. ఆ మూవీ ఏదంటే..?

by Shreyan Ch
February 24, 2023

...

Read moreDetails
వార్త‌లు

Chitram Bhalare Vichitram : చిత్రం భ‌ళారే విచిత్రం మూవీకి చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా..?

by editor
May 12, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.