పదకొండు రోజుల పాటు సేవలు అందుకున్న గణనాథులని ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేస్తున్న విషయం తెలిసిందే. వేలాదిగా గణేశుని విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు తరలి వెళుతుండగా, యువత డ్యాన్సులతో అదరగొడుతున్నారు. అయితే భక్తులతో పాటు పోలీసులు కూడా కాలు కదిపారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో పాల్గొన్న పలువురు పోలీసులు ఎంతో ఉత్సాహంతో భక్తులతో కలిసి డ్యాన్స్‌లు చేశారు.గణేశ్ నిమజ్జనం సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో పాల్గొన్న పలువురు పోలీసులు ఎంతో ఉత్సాహంతో భక్తులతో కలిసి డ్యాన్స్‌లు చేశారు.
ఓ కానిస్టేబుల్ అయితే ఏకంగా డివైడర్‌పై నిలబడి డీజే సాంగ్స్‌కు స్టెప్పులు వేశారు. గణేశ్ నిమజ్జనోత్సవంలో సదరు కానిస్టేబుల్ డ్యాన్స్ అందరిని ఆకట్టుకుంటుంది.. కానిస్టేబుల్ డ్యాన్సుకు అక్కడి జనం ఫిదా అయ్యారు. మరికొందరు పోలీసు అధికారులు కూడా భక్తులతో కలిసి స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. నిత్యం భద్రతా చర్యలో నిమగ్నమయ్యే పోలీసులు ఇలా స్టెప్పులు వేయడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ అన్న డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. ఇక ఈ రోజు మధ్యాహ్నాం 2గంటల సమయంలో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి అయ్యింది.
వేలాది మంది భక్తుల నినాదాల మధ్య బడా గణేశ్ గంగమ్మ ఒడికి చేరుకున్నారు. ఆ తరువాత మిగిలిన గణనాథుల నిమజ్జనం కార్యక్రమం కొనసాగుతోంది. గణనాధుడి నామస్మరణతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు మారుమ్రోగుతున్నాయి. రేపటి (శుక్రవారం) వరకు గణేశ్ నిమజ్జన కార్యక్రమం కొనసాగనుందని తెలుస్తుంది. వేలకొలది భక్తులు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకి చేరుకోవడంతో ఆ ప్రాంతం అంతా సందడిగా మారింది.