Ravinder : మహాలక్ష్మీతో పాటు ఆమె భర్త కూడా చాలా ఫేమస్. అందుకు కారణం వారిద్దరి పెళ్లి. అందంగా ఉన్న మహాలక్ష్మీ బాగా బరువు ఉన్న నిర్మాత రవీందర్ చంద్రశేఖర్‌ని వివాహం చేసుకుంది. వీరి పెళ్లి పిక్స్ నెట్టింట తెగ వైరల్‌కాగా, ఈ జంటపై పలువురు ట్రోల్స్ కూడా చేశారు. అయితే ఎవరు ఎన్ని అన్నా కూడా వీరిద్దరు మాత్రం చాలా అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు అయితే తాజాగా మహాలక్ష్మీ భర్త మోసపూరిత ఆర్ధిక కార్యక్రమాలకు పాల్పడ్డ కేసులో.. పోలీసుల అదుపులో ఉన్నాడు. చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ రవీందర్‌ను అరెస్ట్ చేసింది. ఓ వ్యాపారవేత్తను మోసం చేయడం.. ఆర్ధిక నేరాలకు పాల్పడిన కేసులో.. చంద్రశేఖర్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
ఘన వ్యర్థాల ఉంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను పెట్టి బోల్డన్నీ లాభాలు గడించవచ్చని రవీందర్ చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తిని నమ్మించి మోసం చేసినట్టు టాక్. నకిలీ పత్రాలను సృష్టించి. బాలాజీని ఈ ప్రాజెక్టులో భాగస్వామిని చేశాడు. ఇందుకోసం ఆయన దగ్గర నుంచి 15.83 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు అభియోగాలు ఉన్నాయి. అంతే కాదు వీరిద్దరి మధ్య 2020, సెప్టెంబర్17 ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకూ.. ఒప్పందంలో ఉన్న విధంగా జరక్కపోవడం.. రవీందర్ చెప్పినవి ఏవీ చేయకపోవడంతో.. డబ్బు తిరిగి ఇచ్చేయమని బాలాజీ ఎన్నిసార్లు అడిగినా రవీందర్ నుంచి సరైన జవాబు రాలేదట. దీంతో రవీందర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావించాడు.
రవీందర్ చేసిన మోసపూరిత కార్యకలాపాలతో పాటు ఆర్ధిక అవకతవకలను వివరిస్తూ చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో కంప్లయింట్ చేశారు. బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. దీంతో రవీందర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇక లిబ్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తమిళంలో రవీందర్ చాలా సినిమాలు చేసిన విషయం తెలిసిందు. గత ఏడాదే బుల్లితెర నటి మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. రవీందర్ చంద్రశేఖర్ ఇదివరకే చాలా వివాదాలలో చిక్కుకుని ఉన్నాడు. గతంలో విజయ్ అనే తన ఫ్రెండ్ దగ్గర నుంచి 15 లక్షల రూపాయలు తీసుకుని, ఓ సినిమా నిర్మాణంలో భాగస్వామిని చేస్తానని నమ్మించి మోసం చేసినట్టు కూడా అతనిపై కేసు ఉంది.