PM Modi : టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమంకి ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరవ్వగా.. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పితృదేవతల ముక్తి కోసం పరితపిస్తూ వారి వారసులు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న గంగోత్రి కోసం ఎలా ఎదురుచూస్తున్నారో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాక కోసం రాష్ట్రం ఎదురుచూస్తోందని అన్నారు. అభివృద్ధి లేమి, అప్పులతో ఆంధ్ర ప్రజానీకం కుంగిపోతోందని.. దాష్టీకం, దోపిడీతో ఆంధ్ర ప్రజానీకం, అవినీతి నలిగిపోతోందన్నారు. అప్రజాస్వామి విధానాలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్ర ప్రజానీకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక గంగమ్మ తల్లి హిమాలయాల నుంచి భూమి మీదకు వచ్చి సేదతీర్చినట్లుగా ఉందన్నారు.
2014లో తిరుపతి బాలాజీ, వేంకటేశ్వరస్వామి సాక్షిగా ఈ పొత్తు మొదలైంది. ఈ రోజు ఇక్కడ 2024న బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోబోతోంది. ఆ దుర్గమ్మ తల్లి పొత్తును స్వయంగా ఆశీర్వదిస్తోంది. ఆంధ్రుల రాజధాని అమరావతి దేదీప్యమానంగా వెలగాలని, దానికి నేను అండగా ఉన్నానని మోదీ గారు ఇక్కడకు వచ్చారు అని పవన్ అన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ సభావేదిక వద్దకు చేరుకునే సరికి సభాప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. కొంతమంది కార్యకర్తలు, మీడియా సిబ్బంది పోల్ ఎక్కి మరీ ప్రసంగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని మొదలెట్టగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యలో జోక్యం చేసుకున్నారు.
టవర్ ఎక్కిన కార్యకర్తలను కిందకు దిగాలంటూ విజ్ఞప్తి చేశారు. పవన్ ప్రసంగాన్ని ఆపి మరీ మైక్ అందుకున్న ప్రధాని.. జీవితం చాలా విలువైందని.. ఇలాంటి పనులు చేయవద్దంటూ వారికి సూచించారు. ఇక ప్రధాని పిలుపుతో అక్కడున్న వారంతా కిందకు దిగేశారు.అయితే కాసేపటికే మరో సమస్య మొదలైంది. కార్యకర్తల అత్యుత్సాహం మరో ఇబ్బంది తెచ్చిపెట్టింది. సభా వేదిక ముందు ఏర్పాటు చేసిన సౌండ్ బాక్సుల మీద పెద్ద ఎత్తున కార్యకర్తలు పడటంతో మైక్ కట్ అయ్యింది. దీంతో పదేపదే పవన్ కళ్యాణ్ ప్రసంగానికి అంతరాయం కలిగింది. ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో మైక్ పలుమార్లు అంతరాయం కలిగించింది. అయితే ప్రధాని మోదీ అలాగే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఏపీలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని ఆకాంక్షించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…