PM Modi : తెలంగాణలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు బీజేపీ కూడా ప్రచారంలో ఒక అడుగు వేసింది. నేడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బీసీ ఆత్మగౌరవ సభలో మోదీ పాల్గొంటారు. ప్రధానితో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఈ సభలో పాల్గొంటారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. . అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియం వెళ్లి బహిరంగ సభకు హాజరవుతారు. సభ ముగిసిన తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారు.
అయితే ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఖరారైంది. జనసేనకు 8 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, అశ్వరావుపేట, వైరా, కొత్తగూడెం సీట్లను జనసేనకు కేటాయించనున్నారు. నాగర్ కర్నూల్, కోదాడ, కూకట్ పల్లి, తాండూర్ స్థానాలను కూడా జనసేనకే కేటాయించాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది.అనేక తర్జనభర్జనల మధ్య చివరకు బీజేపీ జనసేనకు కేటాయించే సీట్లను ప్రకటించింది. అయితే రెండు పార్టీల నుంచి పొత్తులు, సీట్లపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. 32 స్థానాలు జనసేన ఆశిస్తే బీజేపీ కేవలం 8 ఇవ్వడంపై జనసేన నాయకులు అసంతృప్తిగా ఉన్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలలో పెద్దగా యాక్టివ్‌గా లేరు. ఇక్కడ వారాహి యాత్ర కాని, సభలు కాని పెట్టింది లేదు. తెలంగాణ సర్వేలలో జనసేన పేరు ఎక్కడ కూడా కనిపించడం లేదు. పవన్ ఫేమ్‌ని వాడుకోవాలని బీజేపీ చూస్తుంది . పవన్ కళ్యాణ్ ఆంద్రా మ్యాప్ అడిగితే, బీజేపీ తెలంగాణ మ్యాప్ పెట్టిందనే టాక్ వినిపిస్తుంది. మరి రానున్న రోజులలో పవన్ కళ్యాణ్‌కి బీజేపీ పెద్ద షాక్ ఇవ్వబోతుందని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు జనసైనికులు కూడా బీజేపీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…