Pilli Subhash Chandra Bose : ఏపీలో జనసేన రోజురోజుకి పుంజుకుంటుంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేస్తూ రాజకీయాలలో అలజడి రేపుతున్నాడు. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ జనసేనలో చేరే యోచనలో ఉన్నారని ప్రచారం సాగుతుంది. వైఎస్ఆర్‌సీపీ నాయకత్వంపై పిల్లి సుభాష్ చంద్రబోస్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుండగా, పిల్లి సుభాష్ చంద్రబోస్ జనసేన వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతుంది. జనసేన తరపున పిల్లి సుభాష్ చంద్రబోస్ కానీ, ఆయన తనయుడు కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణతో పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గానికి విభేదాలు తలెత్తాయి. తన వర్గం నాయకుల్ని మంత్రి చెల్లుబోయిన వేధింపులకు గురి చేస్తున్నారని పిల్లి ఆరోపించారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు.రానున్న ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి పోటీ చేయాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ భావించారు. తనకు టిక్కెట్ దక్కకపోతే కుమారుడికి అవకాశం కల్పించాలని పార్టీకి విజ్ఞప్తి చేశారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేకు మరో మారు అవకాశం ఉంటుందనే సంకేతాలు పార్టీ నుంచి రావడంతో తన దారి తాను చూసుకోవాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
![Pilli Subhash Chandra Bose : వైసీపీకి రాం రాం.. జనసేనలోకి అడుగులు వేయబోతున్న పిల్లి బోస్..? Pilli Subhash Chandra Bose might join janasena](http://3.0.182.119/wp-content/uploads/2023/07/pilli-subhash-chandra-bose-1.jpg)
పిల్లి సుభాష్ చంద్రబోస్ రానున్న రోజులలో వైఎస్ఆర్‌సీపీ ద్వారా లభ్యమైన ఎంపీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన నుండి పిల్లి సూర్యప్రకాష్ కు టికెట్టు ఇచ్చేందుకు ఆ పార్టీ అంగీకరించిందని ప్రచారం సాగుతుందని ప్రచారం జరుగుతుండగా, ఈ విషయమై పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం నుండి తన కొడుకు సూర్యప్రకాష్ ను బరిలోకి దింపాలని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ భావిస్తున్నారు. అయితే ఈ సమయంలో వైఎస్ఆర్‌సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి చేసిన ప్రకటన పిల్లి సుభాష్ చంద్రబోస్ ను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. కాగా, వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుండి చెల్లుబోయిన వేణుకు వైఎస్ఆర్‌సీపీ టికెట్ ఇస్తే తాను మద్దతివ్వనని పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు.అవసరమైతే పార్టీని కూడ వీడుతానని ఆయన రెండు రోజుల క్రితం ప్రకటించారు.