Perni Nani : రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై వైఎస్సార్సీపీ నేతలు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. వందల కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తికి అండగా నిలవడం ఏమిటి అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో విచారణను ఎదుర్కొంటోన్న చంద్రబాబును పవన్ కల్యాణ్ ఓదార్చడానికి వెళ్లాడా? లేక ప్యాకేజీ డీల్ కోసం వెళ్లాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబును ఓదార్చాలనే సెంటిమెంట్ కోసం కాకుండా ప్యాకేజీ సెటిల్‌మెంట్ కోసం పవన్ కల్యాణ్ జైలుకు వెళ్లి చంద్రబాబు పలకరించాడని ఆరోపించారు.
పవన్ పరామర్శకు జైలుకు వెళ్లి డీల్ చేసుకుని వచ్చారు. ప్రజాధనం దోచుకున్న దొంగను పవన్ పరామర్శిస్తాడా?. ఇదేనా పవన్ చెప్పిన జనసేన సిద్ధాంతం?. అవినీతిపై పవన్ రాజీ లేని పోరాటం చేస్తానన్నాడు. మరి అవినీతిపరుడైన చంద్రబాబుకు ఎలా మద్దతు ప్రకటిస్తాడు. తాను దోచుకున్న డబ్బులో లోకేష్ వాటా ఇస్తానని చెప్పాడా?. లోకేష్‌తో సీట్లేనా లేక లెక్కలు కూడా పంచుకున్నారా?. తనను నమ్ముకున్న వారిని మోసం చేసి పవన్ లాభపడుతున్నాడు. సినిమాల్లోనే పవన్ హీరో… బయట మాత్రం జోకర్. 25 స్థానాలకు పవన్ అభ్యర్ధులను సప్లై చేస్తాడు’ అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో గల నిరుద్యోగ యువతకు నైపుణ్యాన్ని నేర్పుతానని, వారికి ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పి, వందల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిన చంద్రబాబును పవన్ కల్యాణ్ పరామర్శించడం ఆయన అవివేకానికి నిదర్శనం అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారను. అవినీతి మీద పోరాటం చేస్తాననేది తమ పార్టీ సిద్ధాంతమని చెప్పుకొని, అదే అవినీతికి పాల్పడి విచారణను ఎదుర్కొంటోన్న ముద్దాయిని ఎలా పరామర్శిస్తాడంటూ నాని అన్నాడు. మీ తమ్ముడు లోకేశ్, బాబాయ్ బాబు దొంగలు అన్నావ్. దోచేసిన డబ్బంతా హెరిటేజ్‌లో పెడుతున్నారు అన్నావ్. మరి ఆ దొంగలతో ఎందుకు కలిశావో ప్రజలకు చెప్పు. వైఎస్సార్సీపీ వాళ్లని ఎవ్వరినీ వదలనంటున్నావు. నీకు చేతనైంది చేసుకో పవన్ కళ్యాణ్. తెరమీద హీరోగా కొనసాగు.. రాజకీయాల్లో జోకర్ వేషాలు ఎందుకు..? అంటూ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…