Pawan On RGV : ప్రస్తుతం ఏపీలో రాజకీయం రంజుగా మారింది. వైసీపీపై జనసేన, టీడీపీలు తీవ్రమైన ఆరోపణలు చేస్తుండగా, వారికి ధీటుగా వైసీపీ కూడా బదులిస్తుంది. అయితే ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ జగన్‌తో పాటు వైసీపీ మద్దతుదారులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఏలూరు సభలో ఆంధ్రప్రదేశ్‌లోని వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయగా, తాడేపల్లిగూడెంలో వారాహి సభలో కూడా పవన్ మాట్లాడారు. అతని మద్దతుదారులు నీచంగా మాట్లాడుతున్నారు. ఒకసారైనా నేను మీ సతీమణి భారతీ మేడమ్ గురించి మాట్లాడానా? కావాలంటే మేడమ్ ను అడగండి, నేనెప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయను.
జగన్.. నువ్వు ముఖ్యమంత్రి పదవికి తగవు, సంస్కార హీనుడివి. పెళ్లాం అని మాట్లాడుతున్న జగన్, నీకు సంస్కారం లేదు. రాష్ట్రంలో కొందరు వాలంటీర్లు అత్యాచారాలు, స్మగ్లింగ్, రౌడీయిజం చేస్తున్నారు. అలాంటి వాలంటీర్లకు నువ్ ఎలాంటి బాధ్యత వహిస్తావ్. ఏపీలో ఆంధ్ర గోల్డ్ విస్కీ రూ.130 లు, బూమ్ బూమ్ రూ.200 ఉన్నాయి. వాలంటీర్ జీతం బూమ్ బూమ్ కి తక్కువ, ఆంధ్ర గోల్డ్ విస్కీకి ఎక్కువ. జనవాణి అనే కార్యక్రమం ప్రారంభం అవడానికి వైసీపీ వాలంటీర్ కారణం అని పవన్ కళ్యాణ్ అన్నారు. మహిళలు కోరుకున్న చోట సంపూర్ణ మద్యపానం అమలు చేస్తామని పవన్ అన్నారు.
![Pawan On RGV : రామ్ గోపాల్ వర్మకి గట్టిగా ఇచ్చి పడేసిన పవన్ కళ్యాణ్.. సినిమాలు కాదు, పుస్తకం కూడా రాయ్..! Pawan On RGV he said about vyuham movie](http://3.0.182.119/wp-content/uploads/2023/07/pawan-on-rgv.jpg)
ఇక జగన్‌కి సపోర్ట్‌గా వర్మ వ్యూహం అనే సినిమా చేస్తున్నాడు.అలానే యాత్ర 2 అనే రూపొందుతుంది. ఈ క్రమంలో పవన్ వారిపై పంచ్‌లు వేశాడు. సినిమాలు చేయడం కాదు కాని జగన్‌పై అయోగ్యుడు మా వాడు అని బుక్ కూడా రాయండి. అందులో చాప్టర్స్ నేను రాస్తాను. ముందుగా సంస్కార హీనత, రెండో చాప్టర్ ఖనిజాలు, మానవ వనరులు దోపిడి, మూడోది పైశాచిక ఆనందం, నాలుగోది ప్రజా సొమ్ముని ఎలా దోచుకోవచ్చు, దౌర్జన్యం, రౌడీయిజం ఎలా చేయాలో ఐదో చాప్టర్‌లో ఉంటుంది. ఇక జనసేన చేతిలో ఎలా చావుదెబ్బ తిన్నాం అనేది ఆఖరి ఘట్టంలో ఉంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు. మరి ఈ వ్యాఖ్యలపై జగన్ స్పందిస్తాడో లేదో తెలియదు కాని వర్మ మాత్రం రెస్పాన్స్ అవుతాడని అంటున్నారు.