Pawan Kalyan : జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కు సినిమా ఇండస్ట్రీ నుంచి లభించిన మద్దతు చాలా తక్కువ. ఆయన ఫ్యామిలీ నుంచి కూడా ప్రత్యక్షంగా వచ్చి మద్దతు ఇచ్చింది చాలా తక్కువ. కానీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ కోసం ఏకంగా ప్రచారాల్లో కూడా పాల్గొనడం విశేషం. బుల్లితెర నుండి వెండితెర వరకు చాలా మంది నటీనటులు డైరెక్ట్ ఆర్ ఇన్‌డైరెక్ట్‌గా పవన్‌కి మద్దతు తెలియజేశారు. ఇక పవన్ కూడా ఊహించని విధంగా 70వేలకి పైగా ఓట్లతో బంపర్ విజయాన్ని అందుకున్నారు. ఇక కూటమి కూడా అఖండ విజయాన్ని అందుకుంది. దీని పట్ల తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఆనందం వ్యక్తపరిచింది.
అయితే సినిమా రంగానికి తెలంగాణ వచ్చినప్పటి నుండి ఎలాంటి సమస్యలు అయితే ఎదురు కాలేదు. కాని ఏపీలో మాత్రం టికెట్ల పెంపుకు అనుమతులు కావాలన్నా, అదనపు ఆటలు వేసుకోవాలన్నా కూడా రోజుల కొద్ది వేచి చూడాలి. దీని వలన పాన్ ఇండియా సినిమా నిర్మాతలు పడిన అగచాట్లు అన్నిఇన్ని కావు.ఈ పరిస్థితులని మార్చాలని చిరంజీవి బృందం జగన్ దగ్గరకి వెళ్లి విన్నపాలు చేసుకున్నారు. అవసరం లేకపోయినా మంత్రుల స్థాయి వ్యక్తులు నిర్మాతలను కూర్చోబెట్టి మీటింగులు పెట్టడం, పవన్ సినిమాలకు ఏకంగా మినిస్టర్లు ప్రెస్ మీట్ లో రివ్యూలు చెప్పడం, టికెట్ హైకులకు అర్ధరాత్రి దాకా నాన్చడం ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద హిస్టరీనే ఉంది.
ఆ సమయంలో ఎవరు గట్టిగా నోరు మెదిపిన పరిస్థితి లేదు. తన సినిమా నష్టపోయిన పవన్ ఏ నాడు వెనక్కి తగ్గలేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీతో కలిసి కూటమి ఏర్పాటు చేశారు. ఇక సీఎం చంద్రబాబునాయుడు, బాలయ్యతో సత్సంబంధాలు ఉన్న వాళ్లే టాలీవుడ్ లో ఎక్కువ. దీంతో టాలీవుడ్‌కి పెద్దగా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉండదు. తెలుగు సినీ పరిశ్రమ నుండి ఎలాంటి వినతులు వెళ్లినా వాటికి సానుకూల స్పందన ఉంటుందనే ఆశాభావం అందరిలోనూ కనిపిస్తోంది. ప్రచార సమయంలో చంద్రబాబునాయుడు పలు సందర్భాల్లో చిరంజీవి, రాజమౌళి, మహేష్, ప్రభాస్ పేర్లను ప్రస్తావించి వాళ్ళను జగన్ అవమానించడం గురించి ప్రత్యేకంగా దుయ్యబట్టారు. అలాంటి సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టే స్థాయి నాది కాదని అన్నారు. రానున్న రోజులలో సినీ ఇండస్ట్రీకి మంచి రోజులే వస్తాయని అనే భావన కలుగుతుంది.