Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. జనసేనానికి మంగళగిరిలో ఓటు హక్కు ఉండటంతో.. తనకు తాను ఓటు వేసే పరిస్థితి లేకుండా పోయింది. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో సతీసమేతంగా మంగళగిరి చేరుకున్న పవన్ కళ్యాణ్.. గిరిజన సహకార సంస్థ పోలింగ్ కేంద్రం ఓటు హక్కు వినియోగించుకున్నారు. పవన్ తన భార్య అన్న లెజెనోవా తో కలిసి పోలింగ్ బూత్ కు వెళ్లి ఓట్లు వేశారు. రెండు ఓట్లు కూడా మంగళగిరిలో అసెంబ్లీకి కూటమి తరపున టీడీపీ నుంచి పోటీలో ఉన్న నారా లోకేష్‌కు అటు గుంటూరు పార్లమెంటుకు.. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ కు ఓట్లు వేశారు.
ఇదిలా ఉంటే పవన్ తన మూడో భార్య లెజినోవాకు కూడా విడాకులు ఇచ్చేసారని.. గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పోలింగ్ రోజు పవన్ కళ్యాణ్ ఈ విడాకుల ప్రచారానికి తెరదించేశారు. అన్నా లెజినోవా తో కలిసి పవన్ కళ్యాణ్ లేరని ఆమె సింగపూర్లో ఉంటున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. మూడో భార్యకు కూడా ఆయన విడాకులు ఇచ్చేసారని జాతీయ మీడియా సైతం ప్రత్యేక కథనాలు ప్రచురించడంతో పోలింగ్ రోజు పవన్ పులిస్టాప్ పెట్టారు. గతంలో విడాకులపై పవన్ కళ్యాణ్ మాత్రం నోరు మెదపలేదు.

ఇటు వైసీపీ వాళ్లు కూడా పవన్ తన మూడో భార్యకు విడాకులు ఇచ్చేసారని ప్రచారం చేశారు. ఇటీవల పిఠాపురంలో పవన్ గృహప్రవేశానికి కూడా లెజనోవా వెళ్లకపోవడంతో రకరకాల సందేహాలకు కారణమైంది. ఇటీవల జనసేన నుంచి బయటికి వచ్చిన విజయవాడకు చెందిన పోతిన మహేష్ కూడా ప్రత్యేకంగా పవన్ మూడో భార్య గురించి కామెంట్లు చేశారు. పవన్ తన గృహప్రవేశానికి భార్యను తీసుకువెళ్లాలని ఆయన సూచించినది జరగలేదు. దీంతో పవన్ తన మూడో భార్య లెజినోవాతో కలిసి ఉండటం లేదని ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి ఈరోజు ఓటింగ్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ పులిస్టాప్ పెట్టేశారు.