Pawan Kalyan : విలక్షణ నటుడు, ఏ పాత్రలోనైన ఒదిగిపోయే సీనియర్ ఆర్టిస్ట్ చంద్రమోహన్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరపనున్నారని తెలుస్తుంది. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. నటుడు చంద్రమోహన్ మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చంద్రబాబును మృతి పట్ల పలువురు సినీ దిగ్గజాలు, రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. చంద్రమోహన్ మృతి పట్ల స్పందించిన జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
చంద్రమోహన్ మరణ వార్త విని ఆవేదన చెందినట్టు ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రమోహన్ లాంటి నటుడు సినీ పరిశ్రమలో ఉండడం మన కళామతల్లి చేసుకున్న అదృష్టమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆయనను తెరపై చూస్తే మనకు ఎంతో పరిచయమైన వ్యక్తినో, మన బంధువునో చూసినట్లు అనిపిస్తుందని, అందరికీ అంత సన్నిహితంగా ఉండే వ్యక్తి మాదిరిగా చంద్రమోహన్ కనిపిస్తాడని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చంద్ర మోహన్ పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి, రాధా కళ్యాణం లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

చంద్రమోహన్ మరణంతో టాలీవుడ్ స్టార్స్ తమ సంతాపాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. మరికొంత మంది చంద్రమోహన్ ఇంటికి వెళ్ళి నివాళి అర్పిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు, జనసేనాని పవన్ కళ్యాణ్. చంద్రమోహన్ ఇంటికి వెళ్లి.. ఆయనకునివాళి అర్పించారు. అటు పవర్ స్టార్ తో కలిసి త్రివిక్రమ శ్రీనివాస్ కూడా పవర్ స్టార్ వెంట ఉన్నారు. చంద్రమోహన్ కునివాళి అర్పించారు. ఆయన మృతి సినీ పరిశ్రమకి తీరని లోటు అని ఆయన అన్నారు. చాలా మంది ప్రముఖులు చంద్రమోహన్ కి ఘన నివాళి అర్పించారు.