Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉంటూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లెజినోవాతో విడిపోయారనే న్యూస్ కూడా పుట్టించారు. ఈ నేపథ్యంలో జనసేన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ ఓ పోస్ట్ పెట్టింది. ‘జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అన్నా కొణిదెల గారు వారాహి విజయ యాత్ర తొలి దశను దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్‌లోని తమ నివాసంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అన్నా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో మంగళగిరి చేరుకుంటారు’ అని ట్వీట్ చేయగా, చాలా మంది పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడిపోయారన్న దాంట్లో వాస్తవం లేదని, ఇదంతా కూడా వైసీపీ పుట్టించిన పుకారని అర్ధమైంది. అయితే పవన్ కళ్యాణ్.. తన ఫ్యామిలీని పదే పదే విమర్శించడపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఆయన జనసైనికులతో మీటింగ్ ఏర్పాటు చేయగా, ఆ మీటింగ్‌లో మాట్లాడుతూ.. నాకు పిల్లలు ఉన్నారు. వీళ్లు అన్న మాటలకు నా భార్య ఏడుస్తుంది. తనకి ఏం చెప్పాను అంటే.. ఇది నాకు తప్పదు. ఒకసారి నేను రాజకీయాలలోకి వచ్చానంటే వెనక్కి వెళ్లలేను. నా వలన నువ్వు మాటలు పడుతున్నందుకు క్షమించు అని అడిగాను. అయితే జగన్ ఫ్యామిలీని ఎవరు ఏమని అనకూడదు. మనకు సంస్కారం ఉండడం వలన ఆయన ఫ్యామిలీని ఏమని అనుకోలేకపోతున్నాం.ఒక సంస్కార హీనుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందనేది ఇప్పుడు అర్ధం అవుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు.