Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా వారాహి యాత్రతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ యాత్రలో జగన్‌తో పాటు వైసీపీ పై నిప్పులు చెరుగుతున్నారు పవన్. తణుకు సభలో జగన్‌ని దారుణంగా విమర్శించారు .క్షమాపణలతో తణుకు సభ ప్రారంభిస్తున్నానని తెలిపారు. తణుకులో పుట్టిన దేవరకొండ బాలగంగాధర తిలక్ తనకు ప్రేరణ అని వెల్లడించారు. తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి కవితా సంకలనం తనకెంతో ఇష్టమని తెలిపారు. నాడు జనసేన ఆవిర్భావ సభలో తన తొలి పలుకులు తిలక్ కవిత్వమేనని వివరించారు. ఇక, గుణం లేనివాడే కులం గొడుగు పడతాడని జాషువా ఆనాడే చెప్పారంటూ పవన్ కల్యాణ్ విమర్శల పర్వం ప్రారంభించారు.
అయితే మనకి ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తే ఏం చేస్తాం. పంపిస్తాం కదా.. అందుకే హలో ఆంధ్రా.. హలో ఆంధ్రా.. బై బై జగన్ అంటూ పవన్ తనదైన స్టైల్‌లో పంచ్‌లు ఇచ్చారు. పవన్ చెప్పిన విధానానినిక జనసైనికులు తెగ గోల చేశారు. ఇక జగ 32 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కొంపలు కూల్చారు. జగన్ అధికారంలోకి రాగానే 32 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. నువ్వు భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులు దోచుకున్నావు. నువ్వు ఇంటి పన్ను రూ.650 పెంచావు. నీ చెత్త పాలన వచ్చాకే చెత్తపై పన్ను వచ్చింది. కనీసం తణుకులో డంపింగ్ యార్డ్ కట్టలేని వాడివి చెత్తపై పన్ను వేస్తావా? అని ఫైర్ అయ్యారు పవన్.
![Pawan Kalyan : జగన్‌కి కి కొత్త స్టైల్‌లో బైబై చెప్పిన పవన్ కళ్యాణ్ Pawan Kalyan told bye bye to cm ys jagan in new way](http://3.0.182.119/wp-content/uploads/2023/07/pawan-kalyan-2-3.jpg)
నువ్వు మందుబాబుల పొట్టకొట్టి రూ.30 వేల కోట్లు దోచేశావు. అన్ని రేట్లు పెంచేశావు కాబట్టే పరదాలు కట్టుకుని తిరుగుతున్నావా జగన్? పాలన ఏ మాత్రం బాగా లేదు జగన్… నువ్వు నొక్కని బటన్ ల సంగతి ఏంటి ? తణుకులో రూ.309 కోట్ల టీడీఆర్ స్కామ్ అంటున్నారు… దీనిపై ఏం చెబుతావు? ఇక్కడ జరిగిన స్కాంపై ఏసీబీ అధికారులు విచారణకు వస్తే నేతలు తప్పించుకుని, కమిషనర్ ను పట్టించారు. అప్పట్లో కాగ్ పట్టుకుంటే సాంకేతిక తప్పిదం అని తప్పించుకున్న దొంగవి నువ్వు జగన్. ఖర్చు చేయాల్సిన నిధులు తాను తరలించుకుంటాడు. ఈ మాత్రానికి వాటికి నవరత్నాలు అని పేరుపెట్టడం ఎందుకు? జగన్‌ని కడిగిపడేశాడు పవన్.