Pawan Kalyan : ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో పవన్ చేసే కామెంట్స్ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన వాలంటీర్ వ్యవస్థ గురించి చేసిన కామెంట్స్ ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే మారాయి. ఇక మంగళగిరి తన పార్టీ ఆఫీసులో పలువురితో మీటింగ్‌లు పెట్టిన పవన్ కళ్యాణ్ పలు విషయాలపై చర్చిస్తున్నారు. తాజాగా అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చేందుకు చిత్తూరు ఎస్పీని కలిసిన సమయంలో ఏ మాట్లాడాడో వివరించారు. 30 వేల మంది ఎలా మిస్ అయ్యారని అలా తేలిగ్గా మాట్లాడతారని నన్ను అడిగాడు.నన్ను వాదించే ప్రయత్నం చేశాడు.
మీరు నాకు ఇవన్నీ ఎలా చెప్పారో, మీ మంత్రి వర్గానికి చెప్పారా.. మీ హోమంత్రికి కూడి ఇలాంటివి చెప్పకపోయారా అని అన్నాను. వినేవాడు ఉంటే ఎవరైన ఎన్నైన చెబుతారు అని నేను అన్నాను అంటూ పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ ఎలా పని చేస్తుందో.. పవన్ కల్యాణ్‌కు చిత్తూరు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ప్రత్యక్షంగా చూపించారు. సైకో పోలీస్ గా విమర్శలు ఎదుర్కొంటున్న అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చేందుకు పవన్ కు సమయం ఇచ్చిన ఆయన… ఆ సంగతి ఏమీ చెప్పకుండా… ఇటీవల్ల వాలంటీర్ వ్యవస్ధపై పవన్ కళ్యాణ్ ను వివరణ కోరారు.
తప్పు చేసిన పోలీసు అధికారిని.. రాజకీయ కారణాలతో వెనుకేసుకు వచ్చి వారిని మరింతగా రెచ్చిపోయేలా చేస్తున్నారని. .. అదే రాజకీయంతో ఎస్పీలు కూడా వ్యవహరిస్తున్నారని జనసైనికులు కూడా మండిపడుతున్నారు. అసలు పవన్ చేసిన వ్యాఖ్యలకు ఎస్పీ వివరణ అడగడం ఏమిటని.. ఆయనకేం సంబంధమని ప్రశ్నిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తాజాగా.. నిధుల దుర్వినియోగం జరగడమే కాకుండా.. రాజ్యాంగ హక్కులను కాలరాసేలా కొన్ని సమాంతర వ్యవస్థలను తయారు చేస్తున్నారని అంటున్నారాయన. ఇక వాలంటీర్ల గురించి మరోసారి ఆయన చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. అవినీతి రహిత రాజకీయాలే తన లక్ష్యమన్న పవన్, ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరి హక్కులను కాపాడేలా చూడాలన్నారు. విదేశాల్లో ఉన్న రూల్ ఆఫ్ లాను ఇక్కడ కూడా తీసుకురావాల్సి ఉందన్నారు.