Pawan Kalyan : సినిమాలలో టాప్ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలలోకి వచ్చారు. జనసేన అనే పార్టీని స్థాపించారు. జనసేనానిగా జనసైనికులకి మార్గ నిర్ధేశం చేస్తున్నారు. ఈ సారి ఎన్నికలలో వైసీపీని గద్ధె దించడం ధ్యేయంగా పెట్టుకున్నాడు. టీడీపీతో కూటమి ఏర్పరచుకున్నాడు.ఈ రెండు పార్టీలు ఈ సారి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కొన్ని నెలల క్రితం వారాహి యాత్ర పేరుతో జనాలలోకి వెళ్లి బహిరంగ ప్రసంగం చేసే వారు. అలాగే వారి సమస్యలు కూడా తెలుసుకునే వారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా రూపొందించిన ఎన్నికల ప్రచార వాహనం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. భారీగా నిర్మించిన రిగ్ లాంటి వాహనంలో పవన్ అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక భద్రత, బహిరంగ ప్రసంగాలు చేశారు.
అయితే కొన్ని రౌండ్ల వారాహి యాత్ర ప్రచారం తర్వాత, పవన్ కళ్యాణ్ ఈ వాహనంలో పర్యటించడం లేదు. ఈ నేపథ్యంలో వారాహి యాత్రకు ఏమైందని అందరూ అడుగుతున్నారు. వారాహి వాహనంపై ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటిస్తానని పవన్ చేసిన ప్రతిజ్ఞలు ఏమయ్యాయని కొందరు అడుగుతున్నారు. ఇటీవల వారాహి వాహనం ప్రజల దృష్టిలో పడకపోవడంతో చర్చ మొదలైంది. టిడిపి-జెఎస్‌పి పొత్తుకు రాబోయే మూడు నెలలు ముఖ్యమైనవి కాగా, పవన్ కళ్యాణ్ స్వయంగా జనసేన కమాండర్ ఇన్ చీఫ్‌గా టిడిపి-జెఎస్‌పి కూటమికి స్టార్ క్యాంపెయినర్‌గా రెట్టింపు కావాలి. కాని సైలెంట్ అయి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.
![Pawan Kalyan : వారాహి యాత్రకు పవన్ బ్రేక్ ఇవ్వడానికి ఇంత బలమైన కారణం ఉందా..? Pawan Kalyan this may be the reason for varahi yatra break](http://3.0.182.119/wp-content/uploads/2024/01/pawan-kalyan-1.jpg)
వారాహి వాహనం ఇప్పటికే ప్రజల దృష్టిని ఆకర్షించింది. సీనియర్ ఎన్టీఆర్ చైతన్య రథం మాదిరిగా భారీ స్థాయిలో ప్రచారం చేశాడు. అయితే సడెన్‌గా ఎందుకు ఆపేశాడు అన్నది ఎవరికి అర్ధం కావడం లేదు. పార్లమెంటరీ ఎన్నికల వ్యూహాల్లో భాగంగా ఆర్గనైజేషన్ నిర్మాణం, రిసోర్సెస్, సమయం చూస్తే.. ఆర్గానిక్ గ్రోత్ కంటే ఇనార్గానిక్ గ్రోత్ మీద ఎక్కువ దృష్టిపెట్టినట్టుగా అనిపిస్తోంది. ఇనార్గానిక్ గ్రోత్ మీదనే నమ్ముకున్నారు.జైలు నుండి బయటకు వచ్చాక చంద్రబాబు ప్రచారంలో స్పీడ్ పెంచారు. కాని పవన్ ప్రచారం తగ్గింది. కొత్త నేతలు, సీనియర్లు రాకతో జనసేన బలోపేతం అవుతున్న నేపథ్యంలో పవన్ ఇలా సైలెంట్ అవడం జనసైనికులకి కూడా ఏం అర్ధం కావడం లేదు. రాబోయే 3 నెలల్లో వారాహి యాత్రను ప్రారంభించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందవచ్చునని కొందరు పవన్‌కి సూచిస్తున్నారు.