Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. మంగళగిరిలోన తన పార్టీ ఆఫీసు నుండి పవన్ కళ్యాణ్ ఏపీలోని సమస్యల గురించి వాకబు చేస్తున్నారు. పలువురితో చర్చలు జరుపుతున్నారు. అలానే ఆయన పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేశారని పవన్ మండిపడ్డారు. వాలంటీర్ల ద్వారా అధికారాలు లాక్కుంటారా అని ధ్వజమెత్తారు. జనసేన కార్యాలయంలో సర్పంచ్‌ల సమావేశం ఏర్పాటు చేశారు. పంచాయతీలను కాపాడుకుందామనే అంశంపై ఇందులో చర్చించారు. ఈ భేటీలో తమ సమస్యలను, అభిప్రాయాలను పవన్ కు తెలియజేశారు సర్పంచ్ లు. అయితే మహిళా సర్పంచ్ మాటలకి కంగుతిన్నారు.
తాను జనసేన నుండి గెలిచిని ఏకైక సర్పంచ్‌ని అని, మాజీ సైనికుడి భార్యని అని ఆమె చెప్పుకొచ్చింది. కొందరు వైసీపీ నాయకులు నన్ను ప్రలోభాలకి గురి చేశారని, డబ్బులు ఇస్తామని కూడా అన్నారని కాని నేను మీ అడుగు జాడలలో నడవాలని జనసేనలో ఉన్నానని ఆ మహిళ చెప్పింది. అలానే మా ఊరిలో చాలా మంది రోడ్డు యాక్సిడెంట్‌లోచనిపోయారు. నేను కూడా దాని బాధితురాలినే. మేము జనసేన తరపున ఎమ్మెల్యేని గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. అంత కృషి చేస్తాం అని అన్నారు. కడప జిల్లా నుండే మీరు మొదటగా గెలవాలని మేము కోరుకుంటున్నాం అని ఆమె చెప్పుకొచ్చింది.
![Pawan Kalyan : ఆ సర్పంచ్ మాటలకి కంగుతిన్న పవన్ కళ్యాణ్.. ఇంతకీ ఆమె ఏం మాట్లాడిందంటే..? Pawan Kalyan surprised by that women sarpanch words](http://3.0.182.119/wp-content/uploads/2023/08/pawan-kalyan-1-1.jpg)
పవన్ మాట్లాడుతూ.. ”గ్రామ సభలు పెట్టకుండా పంచాయతీ రాజ్ వ్యవస్థను నాశనం చేశారు. కొన్ని దశాబ్దాలుగా ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ వస్తున్నారు. వైసీపీ వచ్చాక అది మరింత విస్తృతం చేసి పూర్తిగా నాశనం చేశారు. కేరళ లో పంచాయతీ రాజ్ వ్యవస్థ పై అధ్యయనం చేయాలి. సర్పంచ్ లు క్షేత్ర స్థాయిలో సమస్యలు, ఇబ్బందులు వివరించారు. తండాల్లో మంచి నీరు దొరకని పరిస్థితి కన్నీళ్లు తెప్పించింది. ఏపీలో పంచాయతీ నిధులు దుర్వినియోగంపై కేంద్ర పెద్దలు కూడా చెప్పారు. కేంద్ర నిధులు నేరుగా గ్రామాలకు చేర్చి దుర్వినియోగాన్ని కట్ చేస్తాం. గ్రామీణ నిధులు మళ్లించడం డెకాయిట్, దోపిడీగా చూడాలి. ఇటువంటి వాటిపై పెద్ద ఎత్తున ఉద్యమం జరగాలి అని పవన్ కల్యాణ్ అన్నారు.