Pawan Kalyan : పుట్టపర్తి గడ్డ, టీడీపీ అడ్డ, భారీ మెజార్టీతో గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి మంచి విజయం సాధించింది. వైసీపీ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని..ఆపార్టీ నమ్మే స్థితిలో ప్రజలు లేరంటూ మొదటి నుండి ప్రచారం చేసింది.. పుట్టపర్తి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నా నేను..భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందిస్తానని ఆమె చెప్పుకొచ్చింది. ఎట్టకలేకి మంచి విజయాన్ని అందుకొని అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం కూడా చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
టిడిపి మహిళ ఎమ్మెల్యే అయినా సింధూర రెడ్డి పొరపాటున లేట్ చంద్రబాబు నాయుడు అంటూ మాట్లాడడం జరిగింది.వెంటనే ఈ తప్పు గ్రహించి ఆమె క్షమాపణలు కూడా కోరినట్టుగా తెలుస్తోంది. ఈమె ఎవరో కాదు మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి స్వయాన కోడలు అవుతుంది. సత్యసాయి జిల్లా నుంచి ఎమ్మెల్యేగా నిలబడి మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా చంద్రబాబు నాయుడు పైన మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆమె ఈ విషయం పైన కూడా క్షమాపణలు చెప్పింది. చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం గొప్ప విషయం అన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తాను ఎమ్మెల్యేగా కొనసాగడం గర్వకారణం అన్నారు.
టీడీపీ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ క్రమంలో లేట్ సీఎం ఎన్టీఆర్ పేరు ప్రస్తావించబోయిన ఎమ్మెల్యే సింధూర రెడ్డి లేట్ చంద్రబాబు అని కాస్త తడబడ్డారు. వెంటనే సారి చెప్పారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం విశేషం. అసెంబ్లీలో దాదాపు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మాతృ భాషలో మాట్లాడితే పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి మాత్రం అసెంబ్లీలో ఇంగ్లీషు భాషలో మాట్లాడటం గమనార్హం. ఆమె ఇంగ్లీష్‌లో మాట్లాడుతుండడం చూసి పవన్ కళ్యాణ్ కూడా షాకయ్యారు. ఇంత మంచి టాలెంట్ ఉందా అంటూ ప్రశంసలు కురిపించారు.