Pawan Kalyan : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాద బాధితులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నష్టపరిహారం అందించిన విషయం తెలిసిందే . 49 మంది బాధిత మత్స్యకారులకు రూ.50 వేలు చొప్పున చెక్కులు అందించారు. అనంతరం పవన్ ప్రసంగించారు. ఈ నెల 19న జరిగిన అగ్నిప్రమాదంలో బోట్లు దగ్ధం కావడం బాధాకరమని పేర్కొన్నారు. తెలంగాణా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి సడెన్ గా విశాఖలో ఎంట్రీ ఇచ్చారు శుక్రవారం మధ్యాహ్నం విశాఖ చేరుకుంటారని భావించినా ఆలస్యంగా సాయత్రానికి చేరుకున్నారు. ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో వ్యక్తిగతంగా ఒక్కొక్కరికీ ఇరవై నుంచి ముప్పయి లక్షల కోట్ల రూపాయలలో నష్టం జరిగింది.
దాంతో ప్రభుత్వం ముందుకు వచ్చి ఎనభై శాతం మేర వారికి నష్ట పరిహారం అందించింది. అయితే జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేయడానికి వచ్చారు. ఒక పార్టీగా ఆయన తన సొంత నిధుల నుంచి ఇవ్వాలనుకోవడం అభినందనీయం అని అంటున్నారు. ఏపీలో వైసీపీ మత్య్సకారులను ఒక ఓటు బ్యాంక్ గానే చూస్తోంది అని నిందించారు. తాను మాత్రం అలా చూడను అన్నారు. అయితే వైసీపీని పేరు పెట్టి విమర్శించిన పవన్ ఆ పార్టీతో సహా మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఓటు బ్యాంక్ గానే మత్య్సకారులను చూస్తున్నాయని అనడం విశేషం.
![Pawan Kalyan : అరెయ్ నాని నీకు నేను అండగా ఉన్నాను.. ధైర్యం అందించిన పవన్.. Pawan Kalyan supported youtuber nani for vizag incident](http://3.0.182.119/wp-content/uploads/2023/11/pawan-kalyan-1-1.jpg)
జనసేన పార్టీ ఉంది, మా నేతలు ఉన్నారు, మా వీర మహిళలు ఉన్నారు, మా జన సైనికులు ఉన్నారు… సాటి మనిషిని ఆదుకునేవారు ఉన్నారనే భరోసా కల్పించడమే మా ఉద్దేశం. గతంలో కౌలు రైతులకు కూడా ఇలాగే సాయం చేశాం. ఇవాళ దాదాపు రూ.30 లక్షలు మత్స్యకార సోదరులకు అందించాం. ఇంతటితో మీ కష్టాలు తీర్చేశాను అని చెప్పను.. కానీ మీ కష్టాల్లో, మీ కన్నీళ్లలో నేను కూడా భాగం పంచుకుంటాను అని మాత్రం చెప్పగలను. అందులో భాగంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం’. రూ. 450 కోట్లు పెట్టి రుషి కొండలో జగన్ = ఇల్లు కట్టాడు. అదే డబ్బులతో హార్బర్ కడితే మత్స్య కారులకు ఉపయోగ పడుతుందని అన్నారు. జీవో 217 ఐర్లాండ్ ఫిషరీస్ చట్టాన్ని కాల రాశారని ధ్వజమెత్తారు. తాను మత్స్యకారుల క్షేమం కోరుకునే వాడినని.. ఒక పదేళ్లు నమ్మండి..మీకు మంచి భవిష్యత్ ఇస్తాను అంటూ భరోసా కల్పించారు జనసేనాని పవన్ కళ్యాణ్.