Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే మరోవైపు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో విశాఖపట్నంలోని దసపల్లా హోటల్‌లో జనసేన జనవాణీ కార్యాక్రమం కొనసాగుతుండగా, పవన్ కళ్యాన్‌ను దివ్యాంగులు కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను బాధితులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో న్యాయం చేస్తానని దివ్యాంగులకు జనసేనాని హామీ ఇచ్చారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. అంగవైకల్యం కంటికి కనిపిస్తున్నా… సర్టిఫికెట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.
అయితే సర్టిఫికెట్ ఉన్నప్పటికీ ప్రభుత్వ నుంచి ఆర్ధిక సహాయం అందడం లేదని వారు వాపోయారు. సర్టిఫికెట్ లేని వారు అనేక మంది ఉంటున్నారని.. సర్టిఫికెట్ ఉన్నా కొందరికి న్యాయం జరగడం లేదన్నారు. దివ్యాంగులకు చట్టం ఉందని, అది అమలు కావడం లేదని తెలిపారు. దివ్యాంగులకు ఇబ్బంది పెట్టేవారిని శిక్షించే చట్టం రావాలన్నారు. ప్రభుత్వం కూడా 3 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని జనసేనాని మండిపడ్డారు. సమాజంలో ఇలాంటి వారిని ఆదుకునే వారు ముందుకు రావాలని కోరారు. తాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దివ్యాంగులను గుండెల్లో పెట్టుకుంటానని అన్నారు.
ప్రభుత్వం దివ్యాంగుల దగ్గరికి వచ్చేలా చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు విదేశాల్లో దివ్యంగులను అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేకంగా చూస్తాయన్నారు. ఆత్మ నూన్యత భావం ఉండకూడదనే అనుకుంటానని తెలిపారు. ఎన్డీఏ మీటింగ్‌కు వెళ్ళినప్పుడు ప్రధానమంత్రితో మాట్లాడి న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అందరిని ఎడ్యుకేట్ చేసే బాధ్యత తీసుకుంటానని పవన్ చెప్పార. అప్పు సోప్పో చేసైనా అదుకుంటానని మాటిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమాలు చేసే పని లేకుండా చేస్తానన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు లోన్‌లు ఇచ్చి ఆదుకుంటానని పవన్ తెలియజేశారు.ఇక పిల్లలని పలకరిస్తూ స్వామియే శరణమయ్యప్ప అని పాటని పాడారు. అలానే పాట పాడాలని అన్నారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించారు పవన్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…