Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై విరుచుకుపడుతున్న నేపథ్యంలో వారు కూడా తిరిగి కౌంటర్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ రాజకీయాలు చాలా హీటెక్కిపోతున్నాయి. ఏలూరు సభలో పవన్ కళ్యాణ్ వలంటీర్స్ పై చేసిన ఆరోపణలకి గాను రోజా, పోసాని కృష్ణ మురళి వంటి వారు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్లు రాలగొడతానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీనిపై స్పందించి పవన్ కళ్యాణ్.. ఒక విప్లవ కారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను. మాట్లాడే వాళ్లు కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ చురకలంటించాడు పవన్.
ఇర ఇంట్లో పిల్లల్ని చూసుకొనే గృహిణుల్ని సీఎం జగన్ నీచంగా మాట్లాడి బాగా దిగజారిపోయారని, సంస్కార హీనుడు అయిపోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు.. సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా తాను ఎప్పుడూ విమర్శించలేదని,పాలసీలే మాట్లాడమని అన్నారు. తాము ఎప్పుడూ సీఎం జగన్ సతీమణి భారతిని వివాదాల్లోకి లాగలేదని గుర్తు చేశారు. కానీ, జగన్ పదే పదే తన భార్య, తల్లిదండ్రుల గురించి ప్రస్తావింటున్నారని..జగన్ కు సంస్కారం లేదని, ఆయనకు సీఎంగా ఉండే అర్హత లేదని విమర్శించారు. తాడేపల్లి గూడెంలో నిర్వహించిన వారాహి విజయయాత్రలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి మద్దతు దారులు తనను నీచంగా తిడుతున్నారని, తన ఇంట్లో ఆడవారిపైన కూడా వ్యాఖ్యలు చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మాఫియా వారు కూడా మహిళల జోలికి రారని, జనసేన మహిళలను మాత్రం వైఎస్ఆర్ సీపీ నేతలు మాత్రం పదే పదే తిడుతున్నారంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. తాను రాజకీయాల్లోకి ఎంతో ఇష్టంతో వచ్చానని అన్నారు. జగన్ మాదిరిగా తన తండ్రి ముఖ్యమంత్రి కాదని, కానిస్టేబుల్ అని గుర్తు చేశారు. ఆయనకు వచ్చే డీఏలు, అలవెన్సులతోనే తాము సంతోషంగా బతికామని పవన్ తెలియజేశారు.