Pawan Kalyan : రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ రుషికొండ టూర్ ఎంత టెన్షన్‌గా మారిందో మనం చూశాం. అక్కడకి వెళ్లిన పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంపై దారుణమైన కామెంట్స్ చేశారు.ఈ క్రమంలో రోజా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌పై దారుణమైన విమర్శలు చేసింది. విశాఖపై విషం చిమ్మడమే బాబు, పవన్ లక్ష్యమని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. అక్కడికి పరిపాలన రాజధాని రావొద్దనది వారి ఉద్దేశమన్నారు. రుషికొండపై అక్రమ నిర్మాణాలు జరగడం లేదన్నారు. కోర్టు ఆదేశాలకు లోబడే, అక్కడ అభివృద్ధి పనులు జీ ప్లస్ వన్‌తో ఏడు భవనాలకు అనుమతి ఇచ్చారని రోజా తెలిపారు. అయినా 4 భవనాలు మాత్రమే అక్కడ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఫైర్ సేఫ్టీ, ఎన్విరాన్‌మెంట్‌తో సహా అన్ని అనుమతులు ఉన్నాయన్నారు.
చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పవన్ కల్యాణ్ తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కొండలపై భవనాలు కట్టకూడదనడం పవన్ అజ్ఞానమని విమర్శించారు. కొండలపై భవనాలు కట్టకూడదనడం అజ్ఞానమన్న రోజా.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇల్లు బంజారాహిల్స్ కోండపైనే ఉన్నాయన్నారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పవన్ కల్యాణ్ తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారంటూ మంత్రి రోజా ఆరోపించారు.రుషికొండపై పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ రోజా మండిపడ్డారు. ప్రభుత్వ భూముల్లో భవనాలు కడుతుంటే పవన్‌కు బాధేంటి..? విశాఖను పాలనారాజధానిగా ఎంచుకుంటే చంద్రబాబు, పవన్ కలిసి విషం కక్కుతున్నారంటూ మంత్రి రోజా విమర్శించారు.
![Pawan Kalyan : రోజాకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..! Pawan Kalyan strong counter to roja comments](http://3.0.182.119/wp-content/uploads/2023/08/pawan-kalyan-9.jpg)
అయితే రోజా కామెంట్స్‌పై గాజవాక మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ సరైన పద్దతిలో సెటైర్ వేశాడు. వీరు ఎంత అసంబద్ధంగా మాట్లాడుతున్నారంటే కొండపైన స్వామి వారు ఉంటే ఏం మాట్లాడలేదు, కాని ఇప్పుడు మాట్లాడుతున్నాడా అని వారు విమర్శిస్తున్నారు. నాకు కొండపైన దేవుడు ఉంటే ఇష్టమే. ఇలాంటి రౌడీ మూకలు ఉంటే మాత్రం అస్సలు ఒప్పుకోను అని పవన్ కళ్యాణ్ గట్టిగా బదులిచ్చారు.