Pawan Kalyan : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు రోజురోజుకి హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. జగన్ ప్రభుత్వాన్ని ఒకవైపు జనసేన టార్గెట్ చేస్తుండగా, మరోవైపు చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జగన్ పాలన లో వైఫల్యాలను విడమరచి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు జనసేనాని. అయితే ఈ విమర్శలకు ఎలా చెక్ పెట్టాలో అర్థంకాక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.ఇటీవల వాలెంటరీ వ్యవస్థపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. వాలెంటర్లు డేటా చోరీకి పాల్పడుతున్నారని, ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించే హక్కు వాలెంటర్లకు ఎవరు అధికారం ఇచ్చారని, వాలెంటరీ వ్యవస్థకు ఎవరు బాస్ అంటూ తీవ్ర స్థాయిలో పవన్ ప్రశ్నల వర్షం కురిపించిన విషయం తెలసిందే.
ప్రజల వ్యక్తిగత డేటా ను సర్వేలు అంటూ, కుటుంబ లెక్కలు అంటూ ఇలా ప్రతి చిన్న అంశానికి సేకరిస్తున్నారు వాలెంటర్లు.ఇలా సేకరించిన డేటా ఎక్కడికి వెళ్తోందనేది పవన్ లేవనెత్తున్న ప్రశ్న. అయితే పవన్ ప్రశ్నలకి వైసీపీ నేతలు ఎవరు సరైన సమాధానాలు ఇవ్వడం లేదు. సిఎం జగన్ కూడా తాజాగా జరిగిన మంగళగిరి సభలో వాలెంటరీ వ్యవస్థపై పొగడ్తలు కురిపించారే తప్పా, పవన్ చేసిన విమర్శలకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.పైగా పవన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగడం గమనార్హం. వాలెంటరీ వ్యవస్థపై పవన్ లేవనెత్తిన అంశాలతో జగన్ డిఫెన్స్ లో పడ్డారని విశ్లేషకులు చెబుతున్నారు.
గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు డేటా చౌర్యంపై మండిపడ్డ వీడియో వైరల్ అవుతుంది. ఆధార్ సంబంధించిన డీటైల్స్, బ్యాంక్ అకౌంట్ డీటైల్స్, ఓటర్ డీటైల్స్ వేరే ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉంటే అది పెద్ద క్రైమ్ అని జగన్ అన్నారు. మరి ఆ రోజు అన్ని చంద్రబాబు ప్రభుత్వంపై అన్ని ఆరోపణలు చేసిన జగన్ ఈ రోజు చేసిందేంటి.. వాలంటీర్స్ పేరుతో ప్రజల డేటాని చౌర్యం చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వ శాఖకు చెందని వాలంటీర్లు సేకరిస్తున్న డేటాపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. డేటా లీకేజీ అంశంపై పవన్ కల్యాణ్ నిజాలు బయటపెట్టడంతో ప్రశ్నించడం మొదలుపెట్టిన ప్రజలు. త్వరలో రాష్ట్రమంతా ఉద్యమంలా ప్రజలు వైసీపీపై తిరుగుబాటు మొదలు పెడతారు అని జనసైనికులు అంటున్నారు.