Pawan Kalyan : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ జూన్ 9న పలువురు సన్మిహతుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్ లోని నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, ఉపాసనతో పాటు మెగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు.వరుణ్ తేజ్, లావణ్య ప్రేమ వ్యవహారం గురించి ఇప్పుడిప్పుడే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరిద్దరి ఎంగేజ్మెంట్ పిక్స్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసే విధంగా ఉన్నాయి. వరుణ్ తేజ్ ఆరడుగుల అందగాడిగా కనిపిస్తుండగా.. లావణ్య త్రిపాఠి సొట్టబుగ్గల అందంతో మైమరిపిస్తోంది.
అయితే నిశ్చితార్థ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, అల్లు అర్జున్, అంజనాదేవి, అల్లు అరవింద్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తదితరలు వచ్చారు. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వరుణ్ తేజ్ లావణ్యఉంగరాలు మార్చుకుంటున్నారు .అయితే ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో చాలాబిజీగా ఉన్న పవన్ కూడా ఈ ఈవెంట్‌కి వచ్చారు. అయితే పవన్ తన భార్యతో కాకుండా సోలోగా వచ్చినట్టు సమాచారం. పవన్‌కి సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారుతుంది.
![Pawan Kalyan : వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన పవన్ కళ్యాణ్..! Pawan Kalyan special in varun tej engagement](http://3.0.182.119/wp-content/uploads/2023/06/pawan-kalyan-1.jpg)
మిస్టర్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్ళినప్పుడు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డట్లు తెలుస్తోంది. కెరీర్ లో బాగా స్థిరపడే వరకు తమ ప్రేమ వ్యవహారాన్ని బయటకు రానీయలేదు. ఎంగేజ్మెంట్ పూర్తి కావడంతో పెళ్లి గురించి చర్చ మొదలయింది. మెగా ఫ్యామిలీ వరుణ్, లావణ్య వివాహాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ గా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. తమ ప్రేమ చిగురించిన ఇటలీలోనే పెళ్లి కూడా జరగాలని వరుణ్, లావణ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటలీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి పెట్టింది పేరు. చాలా మంది సెలెబ్రిటీలు ఇటలీలో వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. కానీ వరుణ్ తేజ్, లావణ్య లకి ఇటలీ లవ్ సెంటిమెంట్ గా కూడా కలసి వస్తోంది అని అంటున్నారు.