Pawan Kalyan : టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చి జనసేన అనే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఏపీలో వచ్చే ఎన్నికల్లో జనసేన గట్టి పోటి ఇస్తుందని జనసైనికులు చెబుతుండగా, ఆ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయబోతోంది ? ఎన్ని సీట్లు గెలవబోతోంది ? పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ? గతంలో పోటీచేసిన సీట్లలోనే పోటీ చేస్తారా లేక కొత్త స్ధానాలు ఎంచుకుంటారా ? జనసేన తరఫున పోటీ చేసేందుకు 175 స్ధానాల్లో అభ్యర్ధులు ఉన్నారా లేదా ? జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగబోతోంది ? ఈ ప్రశ్నల్లో ఏ ఒక్క దానికీ ఇప్పుడు జనసేన కార్యకర్తల దగ్గరే కాదు స్వయంగా అధినేత పవన్ వద్దా సమాధానం లేదు.
ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో పవన్ పొత్తుల వ్యవహారంపై పూర్తి క్లారిటీ రావడం లేదు. వారాహి యాత్ర తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూసి పవన్ సింగిల్‌గా పోటీ చేయాలని అనుకుంటున్నారని కొందరు అంటున్నారు. పొత్తులు కుదిరిన లేకపోయిన తనని నమ్ముకున్న వారిని ఆయా నియోజక వర్గాలకి ఇన్‌చార్జిలుగా నియమించి ముందుకు పోవాలని పవన్ అనుకుంటున్నారు. పిఠాపురం, కొవ్వూరు అభ్యర్ధులని ఇప్పటికే ప్రకటించారు. తిరుపతికి పసుపులేటి హరిప్రసాద్‌ని డిక్లేర్ చేసినట్టు సమాచారం.
తిరుపతి నుండి టీడీపీ సుగుణని నిలుచోబెట్టుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హరిప్రసాద్‌ని బరిలోకి దింపి టీడీపీకి సైలెంట్‌గా ఎర్త్ పెడుతున్నాడని అంటున్నారు. మరి దీనిపై జనసేన నాయకులు ఎవరైన స్పందిస్తారా అన్నది చూడాల్సి ఉంది.ఇక ఇదిలా ఉంటే టిడిపి, వైసీపీలు మాదిరిగా జనసేనలో బలమైన నాయకులు లేరు .ఏది వచ్చిన పవన్ మాత్రమే చూసుకోవాలి. ఆయన ఇమేజ్ తోనే పార్టీ ముందుకెళ్లాలి ఎన్నికల బరిలో దిగాలి. ఇంకా మొత్తం భారమంతా పవన్ పైనే ఉంది. అలా ఉండటం వల్ల పార్టీకే మైనస్.
నా, అభివృద్ధ అంశాలపైనా, ఎన్నికల్లో పోటీపైనా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో వాటిపై దృష్టిపెట్టకుండా పవన్ అదే గందరగోళం కొనసాగిస్తున్నారు. కాసేపు టీడీపీతో పొత్తు అనుకునేలా, మళ్లీ అంతలోనే బీజేపీతో పొత్తు కొనసాగుతుందనేలా వ్యవహరిస్తున్నారు. తన పోటీపై కానీ, జనసేన అభ్యర్ధుల పోటీపై కానీ మాట్లాడటం లేదు. దీంతో ఇదే గందరగోళంతో వెళ్లి గత ఎన్నికల తరహాలోనే పవన్ బోర్తా పడడం ఖాయమన్న ప్రచారం పెరుగుతోంది.