Pawan Kalyan Second Son : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. ముందుగా నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులకి విడాకులు ఇచ్చాడు. అయితే వారి దాంపత్యంలో పిల్లలు జన్మించలేదు. ఇక కొన్నాళ్లకి రేణూ దేశాయ్‌ని వివాహం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఆమెతో చాలా రోజుల పాటు సంతోషంగానే ఉన్నారు. వారిద్దరికి అకీరా, ఆద్య జన్మించారు. అయితే ఏమైందో ఏమో కాని వారిద్దరు అనుకోని విధంగా విడాకులు తీసుకున్నారు. అనంతరం అన్నా లెజినోవాని పెళ్లి చేసుకున్నారు. ఆయన భార్య అన్నా లెజ్‌నోవా పిల్లలను మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతున్నారు.
పిల్లలు పాలెనా అంజనా పవనోవ్నా, మార్క్ శంకర్ పవనోవిచ్‌ను మీడియాకు చాలా దూరంగా ఉంచుతున్నారు. మార్క్ శంకర్ పవనోవిచ్ పుట్టిన సమయంలో మీడియాకు ఫోటోలను రిలీజ్ చేసినప్పుడు తప్ప.. మళ్లీ ఆ చిన్నారి ఎలా ఉన్నాడనే విషయం ఎవరికీ తెలియదు. ఆ మధ్య ఓసారి ఎయిర్‌పోర్ట్‌లో పిల్లలు మెరిసారు. ఇక శ్రీజ- కళ్యాణ్ దేవ్‌ల కుమార్తె వేడుక జరిపిన సమయంలో అన్నా తన కుమారుడితో కలిసి వచ్చింది. అప్పుడు కూడా వారిద్దరు స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. అయితే పవన్, అన్నా తాజాగా ఇటలీకి వెళ్లగా ఆ సమయంలో తమ పిల్లలు లేకుండానే కనిపించారు.

పవన్ ఇంతకు ముందు రెండుసార్లు వివాహం చేసుకున్నారు — ముందుగా నందిని (1997-1999), ఆ తర్వాత నటి రేణు దేశాయ్ (2009-2012). అతనికి రేణుతో ఇద్దరు పిల్లలు ఉన్నారు — ఒక కుమారుడు, అకీరా మరియు ఒక కుమార్తె, ఆధ్య. ఇక పవన్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. పవన్ చివరిగా బ్రో చిత్రంతో పలకరించాడు. ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు మూడు నాలుగు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ సినిమాలలో ఒక్క చిత్రం మంచి హిట్ అయిన కూడా పవన్ క్రేజ్ మరింత పీక్స్‌కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.