Pawan Kalyan : మరి కొన్ని రోజులలో ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అన్ని పార్టీలు కూడా పక్కా ప్రణాళికను రూపొందించుకుంటున్నాయి. జనసేన పార్టీ మాత్రం ఈ సారి ఏపీ రాజకీయాలలో చక్రం తిప్పాలని కోరుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జనసేన ప్రభావం చూపిస్తుందని, పొత్తులతో జనసేన అధికారంలోకి వస్తుందని పవన్ బలంగా నమ్ముతున్నారు. గతంతో పోలిస్తే జనసేన ప్రభావం పెరిగిందనే చెప్పవచ్చు .ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో జనసేన ప్రభావం ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది.దీనికి తగ్గట్లుగానే పవన్ పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
పవన్ నిర్వహించిన వారాహి యాత్రకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి స్పందన వచ్చింది. జనసేనకు బలం ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటనలు, యాత్రలు చేపట్టేందుకు , పార్టీకి పెరిగిన గ్రాఫ్ తో పవన్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.అయితే ఇప్పటివరకు పవన్ కు మెగా ఫ్యామిలీ నుంచి మద్దతు అంతంత మాత్రమే అన్నట్టు సాగింది. 2019లో పవన్ ఒక్కడే ప్రచాంర చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం కనిపించబోతుండడంతో, మెగా హీరోలు ఒక్కొక్కరు జనసేనకు మద్దతుగా బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు.
![Pawan Kalyan : చిరంజీవిని జనసేనలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్.. మెగాస్టార్ సమాధానం ఏంటంటే..! Pawan Kalyan said he invited chiranjeevi into janasena](http://3.0.182.119/wp-content/uploads/2023/08/pawan-kalyan-1.jpg)
ఇటీవల బ్రో సినిమా ప్రమోషన్ లో తామంతా పవన్ వెంటే నడుస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు.మాకు రాజకీయాలు తెలియవు కానీ, పవన్ కోసం మాత్రం మేమంతా ఉంటామంటూ సాయి ధరమ్ తేజ్ ప్రకటించడం తో జన సైనికుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. రామ్ చరణ్ కూడా పవన్ కు తమంత అండగా నిలబడతామని ప్రకటించారు.అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు కానీ, పరోక్షంగా పవన్ కోసం తెర వెనుక చేయాల్సింది చేస్తున్నారట. బహిరంగంగా చిరంజీవి మద్దతు ప్రకటించకపోయినా, తమ్ముడు కోసం ఎన్నికల సమయం నాటికి రంగంలోకి దిగే ఛాన్స్ ఉందనే ప్రచారం అయితే జరుగుతోంది.