Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రజల సమస్యలు వింటూ వారి బాగోగుల విషయం గురించి ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్‌లు పలువురు ఏపీకి చెందిన డ్రైవర్లు పవన్‌న కలిశారు. ఆల్ ఇండియా పర్మిట్‌తో తెలంగాణ తాత్కాలిక పర్మిట్ తీసుకుని క్యాబ్‌లు నడుపుతున్నామని.. తమను అక్కడి డ్రైవర్లు అడ్డుకుంటున్నారని పలువురు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి రాజధాని గడువు పరిధి జూన్ 2తో అయిపోయిందంటూ ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ డ్రైవర్లూ… ఏపీ వారిపై మానవత్వం చూపండని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి రాజధాని గడువు తీరగానే హైదరాబాద్‌లో ఉండకూడదంటూ తెలంగాణవారు అడ్డుకుంటున్నట్లుగా తెలిసిందని, ఇది సరికాదన్నారు. ఇది రెండువేల కుటుంబాలకు సంబంధించిన అంశమన్నారు. ఏపీలో రాజధాని పనులు ప్రారంభం కాగానే ఇక్కడి డ్రైవర్లకు ఉపాధి మెరుగవుతుందని ఆకాంక్షించారు. అప్పటి వరకు సాటి ఏపీ డ్రైవర్లపై మానవతా దృక్పథంతో చూడాలని విజ్ఞప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య సఖ్యత ఉండాలన్నారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని పనులు మొదలుకాగానే ఇక్కడి డ్రైవర్లకు ఉపాధి మెరుగవుతుంది అన్నారు.

అప్పటి వరకు సాటి డ్రైవర్లకు మానవతా దృక్పథంతో సహకరించాలని కోరారు. ఈ సున్నితమైన అంశంలో దాదాపు రెండు వేల కుటుంబాల వేదన ఉందన్నారు డిప్యూటీ సీఎం. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారమయ్యేలా చొరవ తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారన్నారు. అమరావతి అభివృద్ధి జరిగితే తెలంగాణ వారికి కూడా ప్రయోజనం కలుగుతుంది కాబట్టి కాస్త ఓపిక పట్టాలని తెలంగాణవారికి ఆయన విజ్ఞప్తి చేశారన్నారు. పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారన్నారు. పవన్‌కు అర్జీ ఇచ్చిన అనంతరం ఓ క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ… ఏపీ క్యాబ్ కనిపిస్తే తగలుబెట్టండని హైదరాబాద్‌లో అంటున్నారని, ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్‌ను శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చామని చెప్పారు.