Pawan Kalyan : హీరోలలో ప్రేక్షకులని ఎక్కువగా ఎంటర్‌టైన్ చేశాడు శోభన్ బాబు. గ్లామర్ హీరోగా పాపులర్ అయినా…డీ గ్లామర్ రోల్స్ లోనూ మెప్పించారాయన. శోభన్ స్క్రీన్ మీదకు వచ్చిన టైమ్ లో జానపదాలు, పౌరాణికాల రాజ్యం నడుస్తోంది. ఆ తర్వాత అన్నగారి పౌరాణిక చిత్ర రాజం లవకుశలో రామానుజుడుగా నటించి మెప్పించారు. శోభన్ బాబు డైరక్టర్స్ హీరో. ఆయన కెరీర్ లో ప్రధానంగా నలుగురైదుగురు డైరక్టర్లు కనిపిస్తారు. కె.ఎస్ ప్రకాశరావు, కె.విశ్వనాథ్, బాపు, వి.మధుసూధనరావు, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు. వీళ్లందరూ శోభన్ బాబు కెరీర్ లో టాప్ మూవీస్ అని చెప్పుకునే సినిమాలు తీశారు.
శోభన్ బాబు హీరోగా ఎంతగానో అలరించిన ఆయన ఫ్యామిలీ నుండి ఒక్క హీరో కూడా రాలేదు. ఇక ఈ హీరోతో కలిసి పవన్ కళ్యాణ్ నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నాడట. అదెలాగా అంటే…పవన్ కల్యాణ్ హీరోగా భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సుస్వాగతం అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కల్యాన్ తండ్రి పాత్ర సినిమాకు చాలా ఇంపార్టెంట్ కాగా ఈ పాత్రలో ప్రముఖ నటుడు రఘువరుణ్ నటించి మెప్పించారు. అయితే నిజానికి ఈ పాత్ర కోసం దర్శకుడు శ్రీనివాసరావు శోభన్ బాబును సంప్రదించారట.
అప్పటికీ శోభన్ బాబు గుడ్ బై చెప్పి ఖాళీగా ఉన్నాడు. నటించలేనని చెప్పడంతో పవన్ శోభన్ బాబులని ఒకే స్క్రీన్‌పై చూసే అవకాశం పొందలేకపోయాం. యవ్వనం తగ్గిపోగానే సినిమాలకు గుడ్ బై చెప్పిన శోభన్ బాబు ఈ ముసలి ముఖంతో వాళ్లకు కనిపించడానికి ఇష్టపడను అని చివరి రోజుల్లో తనను కలిసిన మిత్రులతో చెప్పేవారు . శోభన్ బాబు అన్న మాట అక్షరాలా నిజం. ఆయన ఎంతగా ఆడియన్స్ హృదయాల్లో ముద్ర వేశారంటే.. విజయవాడ, రాజమండ్రి లాంటి సినిమా రాజధానుల్లో ఆయనకు కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేశారు అభిమానులు. శోభన్ బాబు తెలుగు ప్రేక్షకులకు ఒక మధుర జ్ఞాపకం.