Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కొద్ది రోజులుగా ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో మద్రగడ వైసీపీ తరపున ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తొలుత జనసేనలో చేరాలని భావించిన ముద్రగడ ఆ తరువాత వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో వరుసగా పవన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. పవన్ మగాడు అయితే తన పైన నేరుగా మాట్లాడాలని సవాల్ చేసారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి ఇష్టానుసారం మాట్లాడటం సరి కాదని ముద్రగడ పేర్కొన్నారు. పవన్ దగ్గరకు కూడా రానివ్వడు అని అన్నారు. కాని ఇదే సమయంలో పవన్ పిఠాపురం ప్రజలతో సన్నిహితంగా మెలుగుతుండడం చూసి అందరు ముద్రగడని తిట్టిపోస్తున్నారు.
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా అక్కడి నుంచి గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.టీడీపీ మద్దతుతో ఈసారి పిఠాపురం నుంచి కచ్చితంగా గెలిచి తీరుతానని ధీమాగా ఉన్న పవన్.. తాను గెలిచాక తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతానన్న ప్రత్యర్ధుల ప్రచారంపై ఫోకస్ పెట్టారు. దీంతో స్ధానికంగా ఉండేందుకు ఓ కొత్త ఇల్లు కొనుక్కున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా స్ధానికంగా ఉంటూ మధ్యలో హైదరాబాద్ వెళ్లి వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న పవన్.. నియోజకవర్గం పరిధిలోకి వచ్చే గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలు గ్రామంలో ఇంటిని పవన్ కొనుగోలు చేశారా లేక లీజుకు తీసుకున్నారో మాత్రం తెలియలేదు.

తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకలు జరుపుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత వర్మ సహా ఇతర నేతలు హాజరయ్యారు. ముందుగా ఉగాది వేడుకల్లో పాల్గొని ఆశీస్సులు అందుకున్న పవన్.. అనంతరం తాజాగా తీసుకున్న కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. ముందుగా అనుకున్న విధంగానే పవన్ ఉగాది వేళ కొత్త ఇంట్లో అడుగుపెట్టారు. అక్కడికి వచ్చిన పలువురితో చాలా ఆప్యాయంగా పలకరించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.