Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. జనసేన- టీడీపీ పొత్తు ప్రకటించడంతో వైసీపీకి కష్టకాలం మొదలైనట్టే అని అనుకుంటున్నారు. అయిగే గతంలో పవన్ కళ్యాణ్‌పై పలు విమర్శలు చేసిన బండారు సత్యనారాయణ తాజాగా ఆయనకి శాలువా కప్పి సత్కరించారు. గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ రెండుసార్లు ఓడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. అయితే గతంలో పవన్ పై బండారు విమర్శలు చేయగా, ఇప్పుడు పవన్ ని ప్రత్యేకంగా కలిసి ఆయనపై ప్రశంసలు కురిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పవన్‌ని కలిసిన తర్వాత తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై సైకో జగన్ తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ పార్టీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. చంద్రబాబుకు బెయిల్ రావడంతో వెన్నెలపాలెం గ్రామంలో టీడీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. బండారు సత్యనారాయణ మూర్తి నివాసంలో టీడీపీ నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ‘‘హైకోర్టులో చంద్రబాబుకు బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉంది. యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్‌ను ఏర్పాటు చేశారు.

కక్ష సాధింపు కోసం స్కిల్ కేసులో అన్యాయంగా చంద్రబాబును జైల్లో పెట్టారు. చివరకు న్యాయమే గెలిచింది…వచ్చే ఎన్నికల్లో జగన్‌కి ఓటమి తప్పదు’’ అని బండారు సత్యనారాయణ మూర్తి హెచ్చరించారు.టీడీపీ నేతలంతా కలిసి పవన్ కళ్యాణ్‌ని ఆప్యాయంగా పలకరించడం, ఆయనతో సరదాగా సంభాషించడం ఇప్పుడు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.