Pawan Kalyan : తెలంగాణలో ఎన్నికలు మంచి రంజుగా సాగగా, ఈ సారి ఎవరు అధికారం చేజిక్కించుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే కాంగ్రెస్ వైపే ఎక్కువగా గాలి వీస్తుందని ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్‌కి ఈ సారి ప్రజలు పట్టం కట్టేలా లేరని అంటున్నారు. ఈ క్రమంలో షర్మిళతో పాటు పలువురు ప్రముఖ నాయకులు కూడా కాంగ్రెస్ దే గెలుపు అంటున్నారు. ఇటీవల తెలంగాణా ఎన్నికల నేపధ్యంలో బీజేపీతో కలిసి తెలంగాణాలోనూ ఎన్నికల బరిలోకి దిగిన జనసేన పార్టీ, అలాగే మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం సాగించిన జనసేనాని మళ్ళీ ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారు.
ఏపీలోనూ త్వరలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇప్పటి నుండే ప్రణాళికలు రచిస్తున్న పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో తగిలిన దెబ్బ ఈ ఎన్నికల్లో తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో పొత్తులను ముందే ప్రకటించిన పవన్ కళ్యాణ్ టీడీపీ తో కలిసి ప్రయాణం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ మంత్రులు, నేతలు, పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ నిత్యం టార్గెట్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ మాత్రం వెనకడుగు వెయ్యటం లేదు.
![Pawan Kalyan : రేవంత్ నీదే గెలుపు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ Pawan Kalyan interesting comments on revanth reddy](http://3.0.182.119/wp-content/uploads/2023/12/pawan-kalyan.jpg)
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఈ సారిదే అధికారం అంటూ ఆయన ఇన్‌డైరెక్ట్ కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నాయకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణతో పాటు ఏపీలోను రాజకీయం రంజుగా మారుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఇక పవన్ కళ్యాణ్ రెండు పార్టీల మధ్య పొత్తుకు వ్యతిరేకంగా ఏ స్థాయి నాయకులు మాట్లాడినా.. చిన్న కార్యకర్త మాట్లాడినా ఊరుకునేది లేదన్నారు. అలాంటివారిని వైఎస్సార్‌సీపీ కోవర్టులుగా భావిస్తానని.. గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.