Pawan Kalyan : ప్రస్తుతం పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాలకి దూరంగా ఉంటూ పూర్తిగా ఎన్నికల ప్రచారంతోనే ముందుకు సాగుతున్నాడు. అయితే రీసెంట్‌గా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి బ్లేజ్ అంటూ టీజర్ రిలీజ్ చేసింది. ఇందులో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ చేత ఈళలు వేయిస్తుంది. ‘‘గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’’ అంటూ విలన్ పీక కోస్తాడు. ‘‘కచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాసంటే సైజు కాదు సైన్యం. కనిపించని సైన్యం’’ విపరీతంగా ఆకట్టుకుంటుంది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో మొత్తం ఈ డైలాగే మోరుమోగుతుంది.
అయితే ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో పవన్ ఈ డైలాగ్‌ను వాడారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. తనని ఓడిపోయాడంటూ కామెంట్స్ చేసిన వారికి అదిరిపోయేలా గ్లాస్ డైలాగ్‌తో కౌంటర్ ఇచ్చారు. పార్టీ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. మీకు ఒకటి చెప్పాలి. సినిమానుండి విడుదలైన ఉస్తాద్ భగత్‌సింగ్ టీజర్‌లో ఓ సన్నివేశంలో గాజు డైలాగ్ ఉంటుంది. టీ గ్లాజ్ పగిలిపోతుంది. మూవీ షూటింగ్‌లో నేను ఇది అవసరమా? ఎందుకు అని డైరెక్టర్ హరీష్ శంకర్‌ను అడిగాను. ఆయన ఒకటే మాట చెప్పారు. లేదు సార్ అదీ ఇప్పుడు అవసరం. అందరు మీరు ఓడిపోయారు ఓడిపోయారు అంటున్నారు.
మిమ్మల్ని అలా అనడం ఫ్యాన్స్‌గా మేం తట్టుకోలేము. అలాంటి వారికి దీని ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నాం. ఏంటంటే.. ‘గాజు పగిలే కొద్ది పదును ఎక్కుతుంది’. ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే అనుభవం కానిదే ఏది నేర్చుకోం. ఈ రోజు నేను బలంగా ఓట్లు ఎందుకు అడుగుతున్నానంటే.. ఓడిపోయి దశాబ్ధం పాటు ఒడిపోయి అధికారం లేకుండ పార్టీ నడిపాడు. ఇది నాకు ఒక చిన్నపాటి విజయం. అలాంటి ఈసారి కనుగ మనం 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు మనం కొట్టి చూపిస్తే భారత్‌దేశం ఆంధ్రవైపు చూసేలా చేస్తాను” అంటూ పవన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతంది.