Pawan Kalyan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెళ్లైన 11 ఏళ్లకు తండ్రి ప్రమోషన్ అందుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున ముహూర్తం ప్రకారం.. అపోలో వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. మెగా వారసురాలు పుట్టిందనే వార్త బయటకు రావడంతో హాస్పటల్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. మనవరాలు పుట్టడంతో మెగాస్టార్ చిరంజీవి సంతోషంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. ఆసుపత్రిలోకి వెళ్లే సమయంలో మీడియాతో కూడా మాట్లాడిన చిరంజీవి చాలా ఎగ్జైటింగ్‌గా ఫీలవుతూ కనిపించారు. ఇక రామ్ చరణ్ అయితే తనకూతురిని చూసిన వెంటనే చాలా ఎమోషనల్ అయ్యారని తెలుస్తుంది.
కూతురు నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి ఆనంద భాష్పాలు కూడా కార్చారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తండ్రిగా ప్రమోషన్ దక్కడడంతో చరణ్ తన సన్నిహితులకు గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది.చరణ్ ఉపాసనల కూతురుకు పేరు సైతం ఫిక్స్ అయిందని త్వరలో పేరుకు సంబంధించిన విషయాన్ని కూడా అధికారికంగా వెల్లడిస్తారని తెలుస్తోంది. ఇక ఉపాసన ఆసుపత్రిలో ఉన్న సమయంలో మెగా ఫ్యామిలీకి చెందిన పలువురు అక్కడికి వెళ్లి పరామర్శించారు. అల్లు అర్జున్,నిహారిక, వరుణ్ తేజ్ ఇలా పలువురు అపోలోలో కనిపించారు.
![Pawan Kalyan : రామ్ చరణ్ కూతురిని చూడగానే పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏంటంటే..! Pawan Kalyan in hospital after seeing ram charan daughter](http://3.0.182.119/wp-content/uploads/2023/06/pawan-kalyan-8.jpg)
ఇక ప్రస్తుతం ‘వారాహి విజయయాత్ర’ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు, కాకినాడ ప్రాంతం లో వివిధ వర్గాలకు చెందిన వారిని కలుస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. అందుకే చూసేందుకు రాలేకపోయాడని, కానీ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేసాడని అంటున్నారు. అభిమానులు కనీసం ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తే బాగుండును అని అనుకుంటున్నారు. కాని పవన్‌కి ఉన్న బిజీ షెడ్యూల్ వలన ట్వీట్ చేసే అవకాశం లేదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రముఖ జోతిష్య పండితుడు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్‌గా పేరొందిన వేణు స్వామి.. మెగా మనవరాలి జాతకం ఎలా ఉండబోతుందో వీడియో విడుదల చేశారు. తాజా వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘కొణిదెల వంశంలోకి లక్ష్మీదేవి వచ్చిందనేది హాట్ టాపిక్ అవుతోంది.
https://youtube.com/watch?v=NSHjWgt-sMc