Pawan Kalyan : చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాలు ఎంత వాడివేడిగా మారాయో మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తాను టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించిన పవన్.. జగన్ ని ఏపీ రాష్ట్రంలో లేకుండా చేయాలని అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తీరు బాధాకరం. అందుకే కాంగ్రెస్ హఠావో… దేశ్ బచావో అన్నాను. జగన్ ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేస్తున్నారు. మీకు సిగ్గుందా… ఏమైనా దిగి వచ్చారా. శివుడు…వీర భద్రుడిని ఎలా కొట్టాడో అలా ప్రజలు కొట్టగలరు. అధికార మదంతో తమాషాలు చేస్తారా అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను ఉద్దేశపూర్వకంగా గొడవలు చేయను… మీరే రెచ్చ గొడుతున్నారు. 151 స్థానాలు గెలిచిన జగన్‌ను సర్ అని సంబోందించాం. ఆ విలువ ఉంచుకోలేదే… బూతులు తిట్టారు… తిరగనివ్వకుండా అడ్డుకున్నారు.అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసులు, హత్యాయత్నం కేసులు అమాయకులపై పెడతారా. ప్రజలకు కోపం వస్తే… నీ ఆస్తులు కూడా నిన్ను కాపాడలేవు. మరి శృతి మించితే ప్రజలే కొట్టి చంపిన సందర్భాలు ఉన్నాయి. మీరు మర్డర్ లు, రౌడీయిజం చేస్తారు… మమ్మలను రోడ్ల మీదకు వద్దంటారా. ముఖ్యమంత్రి అవగానే కొమ్ములు వచ్చేస్తాయా. నన్ను ఎందుకు అరెస్టు చేస్తారు… జాతీయ రహదారిపై ఆగిన ట్రాఫిక్‌కు జగన్ బాధ్యత వహించాలి.” అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
![Pawan Kalyan : జగన్‌ని ఇమిటేట్ చేసి అందరినీ నవ్వించిన పవన్ కళ్యాణ్ Pawan Kalyan imitated cm ys jagan video viral](http://3.0.182.119/wp-content/uploads/2023/09/pawan-kalyan-5.jpg)
ఇక అలానే జగన్‌ని ఇమిటేట్ చేస్తూ నవ్వులు పూయించారు పవన్. జగన్ రాజ్యాంగాన్ని కించ పరుస్తాడు. బయటకు రాడు. ప్రెస్ మీట్లు పెట్టడు. పేపర్ ఇస్తే పది సార్లు చూసి, నన్ను తిట్టాలనుకున్నా కూడా ఆయనకి సరిగా రాదు. మానసిక స్థితి సరిగ్గా లేదు. అలాంటి వ్యక్తులు పరిపాలన చేయడానికి అనర్హులు అవుతారని భారత రాజ్యాంగంలోనే పేర్కొన్నారంటూ పవన్ సంచలనానికి తెరతీశారు. ఏపీని ఇలా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చేతిలో పెట్టడం కరెక్ట్ కాదన్నారు. సీఎం పదవి ఉందని ఓ ఫీలై పోవద్దు. జగన్.. నువ్వేమైనా దిగొచ్చావా?, నువ్వెంత? నీ బతుకెంత? నీ స్థాయి ఎంత?.” అని జగన్‌పై పవన్ కల్యాణ్ మండిపడ్డారు.