Pawan Kalyan : ఇన్నాళ్లు సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలపై దృష్టి పెట్టాడు. వారాహి విజయాత్ర తొలి బహిరంగ సభ కత్తిపూడిలో జరగగా, ఆ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.తనను కక్షగట్టి అసెంబ్లీలోకి రాకుండా 2019 ఎన్నికల్లో ఓడించినట్లు వ్యాఖ్యానించారని వైసీపీ అధినేత సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.జనసేన ఓడిపోయాక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించారు. అయితే ఆయనకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేశాను. ఆ రోజున ముఖ్యమంత్రికి ఫోనులో ఒకటే చెప్పాను… చాలా పద్ధతి గల ప్రతిపక్షంగా ఉంటాం.
మీ పర్సనల్ విషయాలు జోలికి రాకుండా, విధానపరమైన నిర్ణయాలపై విమర్శించాల్సి వస్తే మాత్రం విమర్శిస్తాం అని అన్నాను. ఇక భవన నిర్మాణ కార్మికుల సమస్య గురించి ఎప్పుడైతే మాట్లాడానో… అప్పటి నుండి నాపై వైసీపీ వాళ్లు కక్షగట్టి… తిట్టని రోజంటూ లేదు. నాతోపాటు ఇంట్లో ఉన్న పిల్లలను కూడా విమర్శించారు.అంత నీచంగా వైసీపీ వాళ్లు విమర్శించారు.నాకు వైసీపీ వాళ్ళ పర్సనల్ విషయాలు తెలియక కాదు. పొట్టి శ్రీరాములుకు ప్రభుత్వాలు తగిన గౌరవం ఇవ్వడం లేదన్నారు. తనకు రాజకీయాలపై స్పూర్తిని కలిగించిన వారిలో చేగువేరా ఒకరని పవన్ తెలిపారు.
అక్రమంగా డబ్బులు సంపాదించి, వేల కోట్లున్న వారితో తాను పోరాటం చేస్తున్నాని జనసేనాని వ్యాఖ్యానించారు. తనను పాలించేవాడు.. తనకంటే నిజాయితీపరుడై వుండాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పాలించేవారికి తాము గులాంగిరీకాదని ..మీ కోసం, మీ భవిష్యత్తు కోసం రాజకీయాల్లోకి వచ్చానని జనసేనాని చెప్పారు. అలానే మద్యపాన నిషేదం అమలు చేయడం కష్టమని ఆరోజే నేను చెప్పాను. అయితే చేసి చూపిస్తానంటూ గొప్పగా చెప్పుకున్నాడు అని జగన్‌ని ఇమిటేట్ చేస్తూ విమర్శించారు పవన్ కళ్యాణ్. అలానే కరెంటు బిల్లులు కూడా తగ్గిస్తానని అన్నాడు. ఎక్కడ తగ్గించాడు అంటూ ఫైర్ అయ్యారు.