Pawan Kalyan : మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి జూన్ 20న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసనకి ఎవరు పుడతారా అని గత కొంత కాలంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులకి జూన్ 20న పులిస్టాప్ పడింది. ఇక ఉపాసన జూన్ 23న డిశ్చార్జ్ కాగా, ఆ సమయంలో రామ్ చరణ్, ఉపాసన మీడియా ముందుకు వచ్చి ఫొటోలకి పోజులిచ్చారు. ఇక తమ చిన్నారి పేరుని 21వ రోజు రివీల్ చేస్తామని స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా మెగా ప్రిన్సెన్స్ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతుంది.
రామ్ చరణ్ ఉపాసనలకి పండంటి బిడ్డ జన్మించడంతో వారికి దేశ విదేశాలకి చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. మెగా ఫ్యామిలీకి చెందిన చిరంజీవి, వరుణ్ తేజ్, నిహారిక, అల్లు అర్జున్ ఇలా వారందరు ఆసుపత్రికి వెళ్లి చిన్నారిని పరామర్శించారు. అయితే రామ్ చరణ్ కి ఎంతో సన్నిహితంగా ఉండే పవన్ కళ్యాణ్ ఆసుపత్రికి వెళ్లలేదు. పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్ర మొదటి విడత ని ఈ నెల 27 వ తారీఖున ముగించబోతున్నాడు. ఆ తర్వాత వెంటనే ఆయన హైదరాబాద్ కి చేరుకొని రామ్ చరణ్ మరియు ఉపాసన ని కలిసి, పాప తో కాసేపు సమయాన్ని గడపబోతున్నాడు.
![Pawan Kalyan : బహిరంగ సభలో పవన్‌ని తాతయ్య అని పిలిచిన అభిమానులు.. రియాక్షన్ ఏంటంటే..! Pawan Kalyan felt shy fans call him grand father](http://3.0.182.119/wp-content/uploads/2023/06/pawan-kalyan-11.jpg)
అంతకముందు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆడబిడ్డ జన్మించిన తరుణాన ప్రేమపూర్వక శుభాకాంక్షలు.. శుభాశీస్సులు” అంటూ ట్వీట్ చేశారు పవన్. ఇక ఇటీవల జరిగిన బహిరంగ సభలో కొందరు అభిమానులు తాత తాత అంటూ పవన్‌ని పిలిచారు. ఆ సమయంలో పవన్ చిన్న చిరు నవ్వి తన స్పీచ్ కొనసాగించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ ని చాలా కాలం తర్వాత ఒకే ఫ్రేమ్ లో చూడబోతున్నందుకు అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఆ సమయం కోసం ప్రతి ఒక్కర ఉ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.