Pawan Kalyan : చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తన నటనతోపాటు మంచి మనస్సుతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఆయన ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ ను సెట్ చేస్తూ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపుతూ ఉంటారు. తాజాగా పవన్ బర్త్ డే సందర్భంగా తమ్ముడు, జల్సా చిత్రాలు థియేటర్స్‌లో హంగామా సృష్టించాయి. పవన్ పేరుపై సరికొత్త రికార్డులు నెలకొల్పేందుకు అభిమానులు బాగానే కష్టపడ్డారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా పవన్ ఫ్యాన్స్ చాలా చోట్ల ఉన్మాదులుగా ప్రవర్తిస్తూ పవన్ కు చెడ్డపేరు తెచ్చారు.
థియెటర్స్ లో గ్యాస్ తో ఫైర్ చేస్తూ నానా హంగమా చేసి భయబ్రాంతులకు గురి చేశారు. కొన్ని చోట్ల థియేటర్స్ సౌండ్ సిస్టమ్స్ బాగా లేదని థియేటర్స్ పై రాళ్ళు విసిరి ఆందోళనకు దిగారు. కొందరు అభిమానులు ఏకంగా థియేటర్ స్క్రీన్ పైకి ఎక్కి తీన్మార్ స్టెప్పులు వేస్తూ రచ్చ రచ్చ చేశారు. ఫ్యాన్స్ వీరంగంతో జల్సా సినిమా షోను కాసేపు నిలిపేశారు. అభిమాన హీరో కనపడగానే సందడి చేయడం మాములే కానీ పవన్ అభిమానులు మాత్రం థియేటర్స్‌పై దాడులు చేస్తున్నారు. గతంలో వకీల్ సాబ్ సినిమా విషయంలో కూడా వారు చేసిన రచ్చ వల్ల సామన్య ప్రేక్షకులు థియేటర్స్ కు రాలేదంటే అతిశయోక్తి కాదు.
పవన్ ఇప్పుడు సినిమా హీరో మాత్రమే కాదు. రాజకీయ నేత కూడా. ఆయన అభిమానులు ఇలా వ్యవహరిస్తే చెడ్డపేరు పవన్‌కే వస్తుంది. ఫ్యాన్స్ అంతా ఇలా ఉంటే ఇమేజ్ దెబ్బతింటుంది. రాజకీయ ప్రత్యర్థులు దీనిని అవకాశంగా తీసుకుంటారు. గుంటూరు డి-మార్ట్‌లో దోపిడీకి పాల్పడ్డారంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. నిజానికి అలాంటిదేమీ జరగలేదు. కానీ ప్రచారం మాత్రం పీక్స్‌లో చేశారు.
మరి పవన్ తన అభిమానులను కంట్రోల్ చేయలేకపోతున్నారా, ఈ విషయంపై భవిష్యత్‌లో అయినా దృష్టి సారిస్తారా అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అభిమానం అనేది హద్దులో ఉండాలి. వారి అభిమాన హీరోను పూజించడం తప్పు లేదు.. కానీ పక్క వారి అస్తులను ధ్వంసం చేయడం, పక్క వారిని ఇబ్బందులు గురి చేయడం మంచిది కాదని అంటున్నారు.