Pawan Kalyan : ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, మీడియా మొఘల్ చెరుకూరి రామోజీరావు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలుగు పాత్రికేయ రంగాన్ని సమూలంగా మార్చేసి.. ఛాందసవాద భావజాలానికి చరమగీతం పాడారు రామోజీరావు. క్రమశిక్షణ, కష్టపడటం, కలిసి పనిచేయడమనే సూత్రాలను ఒంటపట్టించుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అసామాన్యుడిగా ఎదిగి, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. చివరి శ్వాస వరకు ఫైటర్‌గా పోరాడుతూనే ఆయన చివరి శ్వాస విడిచారు. ఆయన మృతితో రామోజీరావు శోకసంద్రంలో మునిగారు. రామోజీరావు మృతి చెందగానే ఆయనని హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలిచారు.
అక్కడ జనసంద్రమైంది. రామోజీ రాజీపడని మనస్తత్వాన్ని మెచ్చుకుంటూనే చివరి దశలో ఆయన పడ్డ క్షోభను గుర్తుచేస్తున్నారు. ఎవరు మాట్లాడినా ఈ మాటలే అంటున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సహా పలు కేసులను రామోజీపై పెట్టిన జగన్ సర్కార్ ఒకానొక దశలో ఆయనను అరెస్ట్ చేయాలని చూసింది. అయితే వయసు , అనారోగ్యం దృష్ట్యా వెనక్కి తగ్గిందని రాజకీయ విశ్లేషకులు అన్నారు. అయితే రామోజీరావుకి కడసారి నివాళులు అర్పించేందుకు పలువురు రాజకీయ నాయకులు ఫిలింసిటీకి వెళ్లారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చి రామోజీరావును కలవాలనుకున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మీడియా దిగ్గజం రామోజీరావు పార్థివదేహానికి ఆయన నివాళులర్పించారు. శనివారం ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న జనసేనాని… రామోజీరావు పార్థివదేహం వద్ద పూలమాల ఉంచి నమస్కరించారు.
జనసేనానితో పాటు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత చినబాబు నివాళులర్పించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రామోజీరావు మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుని నిలబడి ప్రజలను చైతన్యవంతులను చేశారన్నారు. తెలుగు మీడియాలో పని చేస్తోన్న వేలాదిమంది జర్నలిస్టులు ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చినవారే అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించడం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, ఈనాడు సంస్థల ఉద్యోగులకు సానుభూతి తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో గొప్ప ఫిల్మ్‌సిటీని నిర్మించారని వెల్లడించారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు అండగా ఉండాలని కోరుకున్నారు. జనసేన తరఫున సంతాపం తెలియజేస్తున్నట్లు అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…