Pawan Kalyan Daughter Aadya : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్.. రెండు దశాబ్దాల అనంతరం సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది. టైగర్ నాగేశ్వరరావు మూవీలో ఆమె హేమలత లవణం అనే పాత్ర చేసింది. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్. యంగ్ డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తున్నాడు. టైగర్ నాగేశ్వరరావు వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన చిత్రం. 70లలో దేశాన్ని వణికించిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ స్ఫూర్తిగా రూపొందింది. దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదలై మంచి విజయం సాధించింది.70లలో ఆమె సామాజిక కార్యకర్త. జోగిని వ్యవస్థ, అంటరానితనం వంటి సామాజిక దురాచారాల మీద ఆమె పోరాడారు.
హేమలత మేనకోడలు కీర్తిని కలిసి ఆమె గురించి అనేక విషయాలు తెలుసుకున్నాను. హేమలత లవణం పాత్ర చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది. నేను ఈ చిత్రంలో వయసుకు తగ్గ పాత్ర చేశాను. అందుకు ఆద్య సంతోషం వ్యక్తం చేసింది. ఇలాంటి పాత్ర చేస్తున్నందుకు నాకు గర్వంగా ఉందని ఆద్య అన్నదని రేణూ పేర్కొంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రేణుదేశాయ్‌తో కలిసి ఆమె కూతురు ఆద్య కూడా వచ్చింది. ఈ ఈవెంట్‌కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది ఆద్య. పవన్ కూతురుని చూసి అందరు ఆశ్చర్యపోయారు. అయితే ఆద్య.. రేణూ దేశాయ్‌తో కలిసి సెట్స్ కి కూడా వెళ్లింది. అక్కడ ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఒక్కొక్కరిని తెగ భయపెట్టించింది.
ఇక ఆద్య ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది అన్న ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించబోతుంది అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ఓ టాప్ సినిమా ద్వార ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అని ప్రచారం జరుగుతుంది. ప్పటికే ఒక బడా ప్రాజెక్టులో ఆమెను చైల్డ్ ఆర్టిస్టుగా చూపించడానికి రేణు దేశాయ్ కి ఇష్టమైన డైరెక్టర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట . అయితే రేణు దేశాయికి ఇష్టం లేదు అంటూ తెలుస్తుంది . కానీ ఆ డైరెక్టర్ ఆమె చేత బలవంతంగా అయినా ఒప్పించి కూతురు ఆద్య ని స్పెషల్ క్యారెక్టర్ లో చూపించడానికి ట్రై చేస్తున్నారన్న వార్త లీకై వైరల్ గా మారింది.