Pawan Kalyan : పార్టీ పెట్టిన పదేళ్లకి ఎలక్షన్స్‌లో గెలిచి ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి దక్కించుకున్నారు పవన్ కళ్యాణ్.ఆయన ఇప్పుడు రాజకీయాలలో తనదైన మార్క్‌తో దూసుకుపోవడం చర్చనీయాంశంగా మారింది.ఒకప్పుడు విమర్శించిన పెదవులే నేడు శభాష్ అనే విధంగా ప్రస్తుతం ఆ నియోజకవర్గ పని తీరుబట్టి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు వరసగా ఏ కొత్త కార్యక్రమం చేపట్టిన ఆ నియోజకవర్గంలోనే చేపట్టేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ దృష్టిలో పడాలని కొందరు కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరికొందరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చేస్తున్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో 2500 మంది నిరుద్యోగులకు గ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అతి భారీ జాబ్ మేళా ఈనెల 24న పిఠాపురంలో నిర్వహిస్తున్నారు. ఇక ఏపీలోని సుమారు 13వేలకు పైగా పంచాయతీలలో ఇవాళ (ఆగస్ట్ 23వ తేదీన) గ్రామసభలు జరిగాయి. ఒకేరోజు ఈ స్థాయిలో గ్రామసభల నిర్వహణ దేశంలోనే ఇదే తొలిసారి. అయితే కేంద్ర ప్రభుత్వం పంచాయితీలకు నేరుగా నిధులు కేటాయిస్తుంటుంది. గత ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీలకు రూ.40,579 కోట్లు విడుదల చేసిన వాటిని జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించింది. అయితే వాటి గురించి సోషల్ ఆడిట్ నిర్వహించేందుకు సమర్ధుడైన ఐపీఎస్ అధికారికి అప్పగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.మరోవైపు జగన్ హయాంలో నిరుపయోగంగా ఉన్న సర్పంచ్‌లకి ఇప్పుడు పూర్వ వైభవం రానుందని అంటున్నారు.
![Pawan Kalyan : మొదలైన పవన్ మార్కు పాలన.. జనసేన హ్యాపీ..! Pawan Kalyan creating his mark in andhra pradesh government](http://3.0.182.119/wp-content/uploads/2024/08/pawan-kalyan-4.jpg)
ప్రతీ గ్రామసభలో మౌలిక వసతులకు సంబందించి గ్రామస్తుల పిర్యాదులను, సమస్యలను తప్పనిసరిగా లిఖిత పూర్వకంగా రికార్డ్ చేయాలని, నిర్ధిష్టమైన కాలపరిధిలో వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. చెరువులలో చేపల పెంపకం, ఖాళీ భూములలో టేకు, పామాయిల్ తదితర ఫలసాయం అందించే చెట్ల పెంపకం ప్రోత్సహించి వాటి ద్వారా గ్రామాలకు అదనపు ఆదాయం సమకూర్చాలని పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్దం చేయిస్తున్నారు. రాష్ట్రంలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించగలిగితే గ్రామాలు స్వయంసంవృద్ధి సాధించగలవని పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్ముతున్నారు. ఆ దిశలో కూడా కార్యాచరణ సిద్దం చేయిస్తున్నారు. రెండు మూడేళ్లలో గ్రామాలలో సమూలమైన మార్క్ తీసుకొచ్చేవిధంగా పవన్ ముందుకు సాగుతున్నారు.