Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాలపై పూర్తి దృష్టి సారించారు. ఆయన వైసీపీపై విమర్శలు ఎక్కుపెడుతూ గట్టిగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు. తాము ఎవ్వరికీ బీ పార్టీ కాదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాము తెలుగుదేశం పార్టీ వెనక నడవట్లేదని.. తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖపట్నంలోని ఎస్ రాజా గ్రౌండ్‌లో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. విశాఖ ఉక్కు అంశం భావోద్వేగంతో కూడిన అంశమని అన్నారు. ఇదే విషయాన్ని కేంద్రంలోని పెద్దలకు కూడా చెప్పినట్లు తెలిపారు.
విశాఖ ఉక్కును ప్రవైటీకరిస్తే ఎలాంటి భావోద్వేగాలకు దారితీస్తుందో తెలియజేశానని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటం.. అన్ని జిల్లాలను ఏకం చేసిన నినాదమని.. ప్రైవేటీకరణ కాకుండా ప్రయత్నం చేయగలిగామన్నారు. తాను ఎప్పుడూ ఎన్నికల కోసం ఆలోచించలేదని.. ఒక తరం కోసం ఆలోచించినట్లు చెప్పారు. ఈ తరాన్ని కాపాడుకుంటూనే రాబోయే తరం కోసం పనిచేస్తామన్నారు. తాను ఓట్ల కోసం రాలేదని.. మార్పు కోసం ఓట్లు కావాలని పవన్ చెప్పారు. పదవుల కోసం నేను ఎప్పుడూ ఆలోచించలేదు. మీ ప్రేమ, అభిమానంతోనే పార్టీని నడపగలుగుతున్నా. అధికారం కోసం ఓట్లు అడగను.. మార్పు కోసం ఓట్లు అడుగుతా. ఉత్తరాంధ్ర చైతన్యం ఉన్న నేల.. అందరినీ ఆహ్వానించే నేల. ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగాలి.. ఇక్కడే ఉపాధి అవకాశాలు ఉండాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు.
![Pawan Kalyan : రోజా గురించి దిమ్మతిరిగే కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్.. నోట మాట రాదు ఇక..! Pawan Kalyan comments on roja about her behavior](http://3.0.182.119/wp-content/uploads/2023/12/pawan-kalyan-4.jpg)
ప్రజల జీవితాలను దౌర్జన్యంగా నిర్దేశించే పనిలో ఉన్నారు. దశాబ్ద కాలంగా రాజధాని లేని రాష్ట్రం చేశారు. అమరావతే రాజధాని అని ఢిల్లీ నుంచి గుర్తు చేసే దౌర్భాగ్యం. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. క్యాపిటివ్ మైన్స్ కేటాయించేలా ఉమ్మడిగా పోరాటం చేస్తాం. జనసేన-టీడీపీలను నిండు మనసుతో గెలిపించండి అని పవన్ కళ్యాణ్ కోరారు. జనసేన-టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలు, ప్రజల రక్షణ, శాంతిభద్రతలు పటిష్టం చేస్తామన్నారు పవన్. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు రావాలన్నారు. విడిపోయిన రాష్ట్రానికి మేలు జరుగుతుందనే 2014లో బీజేపీకి మద్దతిచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో దాడులు పెరగిపోయాయి. మహిళల మీద చాలా పెరుగుతూ పోతున్నాయి. మహిళా మంత్రులు ఏం చేస్తున్నారని గట్టిగా రోజాకి పంచ్ ఇచ్చాడు పవన్.